నిర్మాత దిల్ రాజుకు పితృవియోగం

ఆయ‌న తండ్రి శ్యామ్‌సుందర్‌రెడ్డి (86) కన్నుమూశారు. వ‌య‌సు సంబంధ స‌మ‌స్య‌లు అనారోగ్యంతో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు.

Update: 2023-10-09 16:28 GMT

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కుటుంబంలో విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి శ్యామ్‌సుందర్‌రెడ్డి (86) కన్నుమూశారు. వ‌య‌సు సంబంధ స‌మ‌స్య‌లు అనారోగ్యంతో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యం తిర‌గ‌బెట్ట‌డంతో సోమవారం రాత్రి ఎనిమిది గంటలు ప‌రిస‌రాల్లో కన్నుమూసినట్లు తెలిసింది. దిల్ రాజుకు ఇది గ్రేట్ లాస్. ఈ సంద‌ర్భంగా తెలుగు సినీ ప్ర‌ముఖులు, ఆయ‌న స‌న్నిహితులు త‌మ ప్ర‌గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిట‌ర్‌గా దిల్ రాజు సుప‌రిచితుడు. టాలీవుడ్ లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను ఆయ‌న నిర్మించారు. కొన్ని తమిళ, హిందీ చిత్రాలకు ఆర్థిక సహాయం చేశారు. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ను స్థాపించి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని నిర్మించారు.

దిల్ రాజు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ప్రముఖ సినిమాలకు చేసిన సేవలకు గాను 2013లో నాగి రెడ్డి -చక్రపాణి జాతీయ అవార్డుతో సత్కరించారు.

దిల్ రాజు నేటి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని నర్సింగపల్లిలో జన్మించారు. ముదకపల్లి, నిజామాబాద్‌లో చదువుకున్న ఈయనకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి. తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి సోదరులతో కలిసి ఆటోమొబైల్ వ్యాపారం చేశాడు.

అతను 1990వ దశకంలో పెళ్లి పందిరి (1997) సినిమాతో చలనచిత్ర పంపిణీలోకి ప్రవేశించాడు. 1998లో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్‌ను ప్రారంభించారు. వ్యక్తిగత జీవితం విష‌యానికి వ‌స్తే... రాజు అనితను వివాహం చేసుకున్నారు. వారికి హన్షితా రెడ్డి అనే కుమార్తె ఉంది. అనిత 11 మార్చి 2017న గుండెపోటుతో మరణించారు. రాజు ఆ తర్వాత 2020లో తేజస్వినిని వివాహం చేసుకున్నారు. జ్యోతిష్యం ప్రకారం తేజస్విని వివాహం తర్వాత ఆమె పేరును వైఘారెడ్డిగా మార్చారు. వారికి 2022లో ఒక కుమారుడు జన్మించాడు.

Tags:    

Similar News