రానాతో ఆ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?

తేజ రానా కాంబో సినిమా నేనే రాజు నేనే మంత్రి సీక్వెల్ అని కొందరు అంటుంటే కొందరు మాత్రం వారిద్దరు కొత్త కథతో వస్తున్నారని అంటున్నారు.

Update: 2023-10-27 23:30 GMT

దగ్గుబాటి హీరో రానా స్టార్ క్రేజ్ కన్నా ప్రయోగాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. హీరోగా చేస్తూనే ప్రతి నాయకుడు పాత్రలు కూడా చేయడం సాహసమే కానీ రానా తన కోసం రాసే ఎలాంటి పాత్రకైనా రెడీ అనేస్తున్నాడు. విరాటపర్వం తర్వాత రానా తన నెక్స్ట్ సినిమా కోసం కొంత గ్యాప్ తీసుకున్నా త్రివిక్రం పర్యవేక్షణలో హిరణ్యకశ్యప సినిమా ప్లానింగ్ లో ఉందని తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మిగతా డెటైల్స్ కూడా రావాల్సి ఉంది.

ఇక మరోపక్క రానాతో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు దర్శకుడు తేజ. రానాతో ఆల్రెడీ నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసి హిట్ అందుకున్న తేజ ఈసారి అంతకుమించిన సినిమా చేయాలని చూస్తున్నాడు. తేజ, రానా కాంబోలో వస్తున్న ఈ సినిమా నేనే రాజు నేనే మంత్రి సీక్వెల్ అని కొందరు అంటున్నారు. ఈ సినిమాకు ముహూర్త కార్యక్రమాలు నవంబర్ 3వ వారం లో ఉంటాయని తెలుస్తుంది. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు.


తేజ దగ్గుబాట్ అభిరామ్ తో అహింస సినిమా చేసి డిజాస్టర్ అందించాడు. అభిరామ్ డెబ్యూ మూవీ పై మొదట కొద్దిగా బజ్ ఏర్పడినా సినిమా రిలీజ్ వాయిదా పడుతూ రావడం వల్ల ఆడియన్స్ ఆ సినిమాపై ఆసక్తి చూపించలేదు. ఫైనల్ రిజల్ట్ కూడా అనుకున్నట్టుగానే నిరాశపరిచింది. అయితే తమ్ముడికి ఫ్లాప్ ఇచ్చినా సరే రానా మరోసారి తేజ డైరెక్షన్ లో నటించాలని అనుకోవడం గొప్ప విషయం.

తేజ రానా కాంబో సినిమా నేనే రాజు నేనే మంత్రి సీక్వెల్ అని కొందరు అంటుంటే కొందరు మాత్రం వారిద్దరు కొత్త కథతో వస్తున్నారని అంటున్నారు. రానా తేజా మాత్రమే కాదు ఈ సినిమాలో కాజల్ ని కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ హిట్ కాంబో చేస్తున్న ఈ ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి. ఒకప్పుడు లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న తేజ ఆ సక్సెస్ ట్రాక్ కొనసాగించలేకపోయాడు.

నేనే రాజు నేనే మంత్రి కన్నా ముందు వరుస ఫ్లాపులు పడ్డాయనే చాలా గ్యాప్ తీసుకుని ఆ సినిమా చేశారు. అయితే ఒక్క హిట్ పడగానే మళ్లీ తర్వాత సినిమాలు తీసి ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు తేజ. రానాతో సినిమా అంటే హిట్ కాంబో కాబట్టి ఈసారి కూడా వారిద్దరు కలిసి మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.

Tags:    

Similar News