ఆ విషయంలో మాత్రం క్షమాపణలు చెప్పిన బేబి డైరెక్టర్..!
ప్రస్తుతం ఏ నోట విన్నా బేబి మూవీ పేరే వినపడుతోంది. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ కి చాలా కాలం తర్వాత వచ్చిన హిట్ ఇది. అసలు ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది.
ప్రస్తుతం ఏ నోట విన్నా బేబి మూవీ పేరే వినపడుతోంది. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ కి చాలా కాలం తర్వాత వచ్చిన హిట్ ఇది. అసలు ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. విరాజ్ మరో కీలక పాత్రలో నటించారు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న`కలర్ ఫొటో` సినిమాకు కథ అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన సాయి రాజేష్ నీలం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎస్కెఎన్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అయితే, ఈ మూవీలో కొన్ని డైలాగులు మాత్రం కొంతమందిని ఇబ్బంది పెట్టాయి. హీరోయిన్ ని బూతు పదంతో తిట్టడం కొందరికి నచ్చలేదు. అదొక్కటే కాదు, హీరోయిన్ ఓ డైలమాలో పడిపోయినప్పుడు ఆమె స్నేహితురాలితో ఓ డైలాగు చెప్పించారు. ఇప్పుడు తెరవాల్సింది కళ్లు కాదు... అంటూ చెప్పిన డైలాగ్ చాలా అసహ్యంగా అనిపించింది.
హీరోయిన్ ని కించపరిచేలా ఆ డైలాగు చెప్పడం అభిమానులకు నచ్చలేదు. ఈ ఒక్క డైలాగు విషయంలో చిత్ర బృందం పై విమర్శలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై డైరెక్టర్ సాయి రాజేష్ స్పందించారు. ఆ డైలాగు రాయడం నిజంగా తన తప్పేనని, అలాంటి డైలాగు రాయకుండా ఉండాల్సిందని ఆయన చెప్పడం విశేషం. ఈ డైలాగు రాసినందుకు ఆయన క్షమాపణలు చెప్పడం విశేషం.
ఇక మూవీ విడుదలైనప్పటి నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ నటకు ప్రశంసల వర్షం కురుస్తోంది. అసలు పెద్దగా గుర్తింపు లేని నటీనటులతో సినిమా తీసి ఊహించని హిట్ అందుకున్నారు. కాగా మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం విడుదలైన వారం రోజుల్లోనే రూ.23కోట్లు రాబట్టింది అంటేనే ఈ మూవీ ఎంత క్లిక్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
ఇదిలా ఉండగా, ఈ మూవీ హిట్ తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ఆఫర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆచి తూచి అడుగులు వేస్తోందట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఇప్పటికే ఓ మూవీ ఒకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది.