వినాయక్.. ఏం చేస్తున్నాడంటే..
ఒటీటీ స్పేస్ కి ఇప్పుడు డిమాండ్ పెరగడంతో అటు వైపుగా వినాయక్ దృష్టి పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది
కమర్షియల్ చిత్రాలతో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న డైరెక్టర్ వివి వినాయక్. ఆది సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన వినాయక్ స్టార్ హీరోలకి సూపర్ హిట్ మూవీస్ అందించారు. అదే సమయంలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ని కూడా ఖాతాలో వేసుకున్నారు. ఆయన నుంచి ఈ ఏడాది హిందీలో ఛత్రపతి మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.
ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ మూవీ నిలిచింది. వినాయక్ ఇమేజ్ కూడా కొంత వరకు డ్యామేజ్ అయ్యింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ ఓ వైపు వినిపిస్తోంది. తాజాగా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. త్వరలో వివి వినాయక్ ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించాలని అనుకుంటున్నారంట.
ఒటీటీ స్పేస్ కి ఇప్పుడు డిమాండ్ పెరగడంతో అటు వైపుగా వినాయక్ దృష్టి పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న ఇంటిని ఆఫీస్ గా మార్చే ప్లాన్ లో ఉన్నారంట. త్వరలో దీనికి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది దర్శకులు ప్రొడక్షన్ హౌస్ లు స్టార్ట్ చేసి చిన్న సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వినాయక్ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు టాక్.
ఇక తన ప్రొడక్షన్ హౌస్ లో కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వనున్నరంట. మరి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే దర్శకత్వంపై వినాయక్ పూర్తిగా ఫోకస్ తగ్గించే ఛాన్స్ ఉందా అన్బే క్వశ్చన్ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో అనుకున్న ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే అవకాశం ఉందా అనే డౌట్ కూడా వస్తోంది.
ఒటీటీ ట్రెండ్ నడుస్తోన్న నేపథ్యంలో స్టార్ హీరోలు, దర్శకులు అందరూ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని లో బడ్జెట్ తో డిఫరెంట్ కథలని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ దారిలో వినాయక్ కూడా ఎంత వరకు సక్సెస్ అవుతారనేది చూడాలి.