వీడియో : హాట్ బ్యూటీ కొత్త టాలెంట్ చూశారా!

2015 లో లోఫర్ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటాని. మొదటి సినిమా తో తెలుగు లో మెప్పించలేక పోయిన ఈ అమ్మడిని బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆధరించారు.

Update: 2023-11-24 06:28 GMT

2015 లో లోఫర్ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటాని. మొదటి సినిమా తో తెలుగు లో మెప్పించలేక పోయిన ఈ అమ్మడిని బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆధరించారు. ఈ అమ్మడికి అక్కడ బాగానే ఆదరణ లభించింది. వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తూ కెరీర్‌ లో దూసుకు పోతున్న విషయం అందరికీ తెల్సిందే.

ఒక వైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు మరో వైపు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటో షూట్స్ షేర్ చేస్తూ తన అభిమానులకు కన్నుల విందు చేస్తుంది. తాజాగా తనలోని మరో యాంగిల్ ను ఈ అమ్మడు ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. తాజాగా ఈ అమ్మడు ఒక మ్యూజిక్ ఆల్బం కి దర్శకత్వం వహించింది. ఆ మ్యూజిక్‌ ఆల్బం విడుదల అయింది.

గతంలో కూడా రెండు మ్యూజిక్ ఆల్బమ్ లో నటించిన ఈ అమ్మడు తాజాగా తన మూడో మ్యూజిక్‌ ఆల్బం అయిన క్యూన్ కర్ ఫికర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మ్యూజిక్ ఆల్బం లో దిశా పటాని కనిపించడం తో పాటు తానే స్వయంగా దర్శకత్వం వహించింది. ఈ మ్యూజిక్‌ ఆల్బం ను తానే స్వయంగా రూపొందించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

సోషల్‌ మీడియాలో హాట్ ఫోటోలు షేర్‌ చేయడం తో పాటు ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేస్తూ ఉండే ఈ అమ్మడు ఇప్పుడు ఇలా మ్యూజిక్‌ ఆల్బం దర్శకురాలిగా మారడంతో ముందు ముందు మరెన్ని కలలు ఈమె నుంచి చూడాల్సి వస్తుందో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిశా మ్యూజిక్ ఆల్బం కి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కుతుందట.

Full View
Tags:    

Similar News