నిర్మాతలని టెన్షన్ పెడుతోన్న డిస్టిబ్యూటర్స్
స్టార్ హీరోల చిత్రాలు హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా బిజినెస్ జరగడంతో థియేటర్స్ లో బ్రేక్ ఈవెన్ అందుకునేవి.
ఒకప్పుడు సినిమా సక్సెస్ రేట్ ఎప్పుడు హీరో, దర్శకుడి కాంబినేషన్ మీద ఆధారపడి ఉండేది. స్టార్ హీరోల చిత్రాలు హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా బిజినెస్ జరగడంతో థియేటర్స్ లో బ్రేక్ ఈవెన్ అందుకునేవి. అభిమాన హీరో సినిమా అంటే ఫ్యాన్స్ విపరీతంగా థియేటర్స్ కి వెళ్లి మూవీ చూసేవారు. దాంతో పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేది. అలాగే సినిమాల బడ్జెట్ లు కూడా గతంలో తక్కువలోనే ఉండేవి.
బాహుబలికి ముందు వరకు స్టార్ హీరో మీద కూడా 50 కోట్ల పెట్టుబడి పెట్టడం పెద్ద రిస్క్. కాని ఇప్పుడు నిర్మాతల వందల కోట్ల బడ్జెట్ చాలా ఈజీగా ఖర్చు చేస్తున్నారు. కాని థియేటర్స్ లో రిలీజ్ బిజినెస్ జరగడం కష్టం అయిపోతుంది. స్టార్ హీరో, స్టార్ దర్శకుడు అయిన కంటెంట్ బాగోకపోతే రెండు రోజులకె థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. దీంతో భారీ డిజాస్టర్ లు వస్తున్నాయి.
దీనికి భయపడి డిస్టిబ్యూటర్స్ కాంబినేషన్స్ బేస్ చేసుకొని సినిమాలు కొనడం పూర్తిగా మానేశారు. మార్కెట్ డైనమిక్స్ చాలా మారడంతో డిస్ట్రిబ్యూటర్లు ఒకప్పటిలా నిర్మాత అడిగిన రేటు సినిమాకి ఇవ్వడం లేదు. అలాగే నిర్మాతల షరతులకి ఈజీగా అంగీకరించడం లేదు. నిరంతరం సినిమాపై నడుస్తోన్న బజ్ ను ట్రాక్ చేస్తూ, రైట్స్ కోసం బేరసారాలు జరుపుతుండటంతో నిర్మాతలకి ఒకప్పటిలా సినిమా మార్కెట్ సేఫ్ గా లేదు.
ఈ వారం నుంచి డిసెంబర్ వరకు పలు సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. వీటిలో సలార్ మినహా ఏ సినిమా థియేట్రికల్ రైట్స్ క్లోజ్ కాలేదని, ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు. సలార్'కు కూడా ఆంధ్రప్రదేశ్ లో 20 నుంచి 30 శాతం వరకు నిర్మాతలు బేరసారాలు జరిపారు. దీని వెనుక ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే చాలా సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం అని తెలుస్తోంది.
చాలా సినిమాలు బజ్ క్రియేట్ చేయడంలో విఫలమవుతున్నాయి. ప్రమోషన్స్ తో కొంత పాజిటివిటీ క్రియేట్ చేయడానికి ఆయా చిత్ర దర్శక, నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదో నామమాత్రం ఇంటర్వ్యూలతో సినిమా ఆడియన్స్ కి రీచ్ కావడం లేదు. కొత్తగా ఏదైనా చేయగలిగితే లేదంటే టీజర్, ట్రైలర్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగితే కొంత బజ్ క్రియేట్ అవుతుంది. ఆ బజ్ ఆధారంగా డిస్టిబ్యూటర్స్ సినిమాలు కొనడానికి ముందుకొస్తున్నారు.