మార్ ముంతా చోడ్ చింతా.. దూసుకుపోతోందిగా!

అదే సమయంలో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు.

Update: 2024-07-19 10:46 GMT

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ హీరో రామ్ పోతినేని కాంబోలో డబుల్ ఇస్మార్ట్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు లాస్ట్ కు చేరుకుంది. త్వరలోనే థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో డబుల్ ఇస్మార్ట్ మేకర్స్.. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు.

అయితే ఇస్మార్ట్ శంకర్.. థియేటర్లలోకి రాకముందే మ్యూజికల్ హిట్ అయిన విషయం గుర్తుందా? మూవీ రిలీజ్ అయ్యాక కూడా సాంగ్స్ ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కూడా అలాగే అయ్యేలా కనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ కు మ్యూజిక్ అందించిన మణిశర్మనే సీక్వెల్ కు కూడా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ విడుదల చేసిన స్టెప్పా మార్క్ సాంగ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన రెండో లిరికల్ సాంగ్ మార్ ముంత చోడ్ చింతా వేరే లెవెల్ లో రెస్పాన్స్ అందుకుంటోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ సాంగే కనిపిస్తోంది. విడుదల అయ్యి మూడు రోజులు అవుతున్నా.. అందరినీ ఊపేస్తోంది. రామ్ పోతినేని డ్యాన్స్, మణిశర్మ బీట్స్ తో సాంగ్ సూపర్ హిట్ అయింది. రామ్ సరసన చిందులేసి హీరోయిన్ కావ్య థాపర్ అదరగొట్టేసింది. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ కు రాహుల్ సిప్లిగంజ్, ధనుంజన్ సీపాన, కీర్తన శర్మ గాత్రం తోడవ్వగా.. హైదరాబాద్ యాసలో అలరిస్తూ మార్ ముంత చోడ్ చింతా సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ట్రెండింగ్ నెం.1లో అలరిస్తోంది. మ్యూజిక్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తోంది. అదే సమయంలో మేకర్స్ రిలీజ్ చేసిన ఆ సాంగ్ మేకింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్- కావ్య స్టెప్స్, సెట్స్ లో షూటింగ్ బిట్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి.

ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్.. విలన్ గా కనిపించనున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తూ.. సీనియర్ హీరోయిన్ ఛార్మితో కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలని పూరీ జగన్నాథ్ పట్టుదలతో ఉన్నారు. రామ్ కు కూడా ఈ మూవీ హిట్ అవ్వడం చాలా అవసరం. మరి డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News