ఆ సంస్థలో మరో భారీ బడ్జెట్ చిత్రమా?
వైజయంతీమూవీస్- మలయాళ హీరో దుల్కార్ సల్మాన్ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
వైజయంతీమూవీస్- మలయాళ హీరో దుల్కార్ సల్మాన్ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో దుల్కార్ కి వైజయంతీ ఓ మాతృ సంస్థ లాంటింది. అతడి తొలి సినిమా `మహానటి` ఆ సంస్థలోనే రూపొంది ఎలాంటి గుర్తింపును తీసుకొచ్చిందో తెలిసిందే. అటుపై చేసిన `సీతారామం` దుల్కార్ మరింత ఫేమస్ చేసింది. ఆ ఒక్క విజయంతో దుల్కార్ కి తెలుగు అవకాశాలు క్యూ కట్టాయి. ఆ రకంగా వైజయంతీ ద్వారా దుల్కార్ కి బెస్ట్ లాంచింగ్ దొరికింది.
ప్రస్తుతం సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో `లక్కీ భాస్కర్` అనే సినిమా చేస్తున్నాడు. దీనిపై మంచి అంచనాలున్నాయి. మరి మళ్లీ వైజయంతీలో దుల్కార్ కలిసేదుప్పుడు? అంటే అందుకు ఎంతో సమయం లేనట్లే కనిపిస్తుంది. సదరు సంస్థతో దుల్కార్ తో ఈ సారి భారీ బడ్జెట్ చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నట్లు లీకులం దుతున్నాయి. ఏకంగా పాన్ ఇండియా సినిమా ప్లాన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే `కల్కి 2898` విజయంతో వైజయంతీ రేంజ్ పాన్ ఇండియాకి రీచ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం ఆ సంస్థ 600 కోట్ల రూపాయల్ని వెచ్చించి నిర్మించి అంతకు మించిని లాభాలతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో వైజయంతీ మూవీస్ తదుపరి చిత్రాలు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగానే మరోసారి దుల్కార్ ని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా దర్శకుడు ఎవరు? అంటే మలయాళ దర్శకుడు పవన్ సాధినేని పేరు వినిపిస్తుంది.
ఇతడు ట్యాలెంటెడ్. ఇప్పటికే ప్రేమ్ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి లాంటి సినిమాలు చేసాడు. ఇవీ భారీ విజయాలు కాకపోయినా కంటెంట్ బేస్డ్ చిత్రాలుగా నిలిచాయి. అలాగే ఆయన తెరకెక్కించిన కొన్ని వెబ్ సిరీస్ లకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా `దయ` అనే వెబ్ సిరీస్ కి ఓటీటీ అవార్డు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వైజయంతీ అతడిలో ప్రతిభను గుర్తించి దుల్కార్ తో సినిమా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ప్రతిభావంతుల్ని వెతికి పట్టుకోవడంలో లేడీ నిర్మాతలు స్వప్నాదత్, ప్రియాంక దత్ స్పెషలిస్ట్ లు అన్న సంగతి తెలిసిందే.