'డంకీ' అంటే అర్థం అదా...!
తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన సినిమాకు 'డంకీ' అనే టైటిల్ ను పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ మధ్య కాలంలో సినిమాల టైటిల్స్ విషయంలో చాలా క్రియేటివ్ గా మేకర్స్ ఆలోచిస్తూ ఉన్నారు. టైటిల్ గురించి జనాల్లో చర్చ జరగాలి, తద్వారా సినిమాకు పబ్లిసిటీ రావాలి అనే ఉద్దేశ్యంతో కొందరు టైటిల్స్ ను ఎంపిక చేస్తూ ఉంటే మరి కొందరు మరో రకంగా ఆలోచించి సినిమాలకు సంబంధించిన టైటిల్స్ ను ఖరారు చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన సినిమాకు 'డంకీ' అనే టైటిల్ ను పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డంకీ ని చాలా మంది చాలా రకాలుగా పలుకుతూ ఉన్నారు. కొందరు డాంకీ అయ్యి ఉంటుంది... అంటే గాడిద అని అనుకుంటున్నారు. మొత్తానికి డంకీ అంటే ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేక జుట్టు పీక్కుంటున్నారు.
డిసెంబర్ 22న డంకీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యం లో హీరో షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ డంకీ సినిమా ప్రమోషన్ చేశాడు. ఆ సమయంలో కొందరు డంకీ అంటే అర్థం ఏంటి అంటూ ప్రశ్నించారు.
ఆ ప్రశ్నలకు షారుఖ్ స్పందిస్తూ.. ఏదైనా సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించే వారిని డంకీ అని పిలుస్తారు. సరిహద్దులు దాటే వారిని డంకీ అని మాత్రమే కాకుండా ఫంకీ, హంకీ లేదా మంకీ అని కూడా పిలుస్తారు కొందరు అంటూ షారుఖ్ ఖాన్ ఈ సంద్భంగా చెప్పుకొచ్చాడు. విభిన్న కథాంశం తో ఈ సినిమా రూపొందినట్లు ఆయన పేర్కొన్నాడు.
నలుగురు స్నేహితులు అక్రమంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే ఈ సినిమాకు డంకీ అనే టైటిల్ ను పెట్టారని తెలుస్తోంది. మొత్తానికి డంకీ టైటిల్ అర్థం ఇదా అంటూ షారుఖ్ ఖాన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నాడు.
ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. ఈయన నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్. అందుకే ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అంటున్నారు. ఇక ఈ ఏడాది లో ఇప్పటికే పఠాన్, జవాన్ లతో వచ్చి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన షారుఖ్ డంకీ తో మరో వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తాడు అనే నమ్మకం ను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.