దసరా పోరు.. ఎవరి బలమెంత?
ఈసారి దసరా బాక్సాఫీస్ ఫైట్ చాలా ఆసక్తికరంగా కొనసాగబోతోంది. మూడు విభిన్నమైన సినిమాలు వేటికవే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్నాయి
ఈసారి దసరా బాక్సాఫీస్ ఫైట్ చాలా ఆసక్తికరంగా కొనసాగబోతోంది. మూడు విభిన్నమైన సినిమాలు వేటికవే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్నాయి. రెండు తెలుగు సినిమాలతో పాటు ఒక తమిళ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం గట్టిగానే సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే వీటిలో ఏది కంటెంట్ తో ఎక్కువ స్థాయిలో ఆకట్టుకుంటే దానికే మంచి కలెక్షన్స్ వస్తాయి. భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు - లియో ఈ మూడు సినిమాలు కంటెంట్ పరంగా దేనిబలం ఎంత అనే వివరాల్లోకి వెళితే..
ముందుగా టైగర్ నాగేశ్వరరావు సినిమా టైటిల్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా ఈ కథను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇక కంటెంట్ పరంగా సినిమాలో అయితే దోపిడీలు అలాగే మాస్ రాజా హీరో ఎలివేషన్స్ తో పాటు ఒక డిఫరెంట్ డ్రామా ఉండబోతోంది. ఇందులో రేణు దేశాయ్ పాత్ర కూడా కథలో చాలా కీలకం. రవితేజ మాస్ ఫైట్స్ ఎలాగూ ఉంటాయి. అయితే టైగర్ పాత్రలో రవితేజ ఇంకా ఎంతగా కొత్తగా కనిపిస్తాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇందులోనే సీరియస్ డ్రామా తో పాటు టైగర్ నాగేశ్వరరావు పాత్ర ఏమాత్రం క్లిక్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డామినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది
ఇక నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్నాడు అనగానే భగవంత్ కేసరి పై అంచనాలు పెరిగాయి. ఇక తర్వాత వచ్చిన పోస్టర్లు టీజర్ లో ట్రైలర్ కూడా అంచనాల స్థాయిని మరొక లెవెల్కు పెంచింది. తమన్ మ్యూజిక్ తో అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు అని ఒక హోప్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించబోతున్నారు.
ఇక శ్రీలీల ఆర్మీ కోసం సిద్ధమయ్యే అమ్మాయిగా కనిపించబోతోంది. తండ్రి కూతురు ఎమోషనల్ తరహా బాండింగ్ ఇందులో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలయ్య బాబుతో 8 ఫైట్లు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ఇందులో హైలెట్గా నిలవబోతున్నాయట. అలాగే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది అని తెలుస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడు. ఇక దీనికి తోడు అతని కామెడీ టైమింగ్ కామెడీ కూడా తోడైతే బాక్సాఫీస్ వద్ద ఇది కూడా డామినేట్ చేసే అవకాశం ఉంటుంది.
ఇక విజయ్ లియో సినిమా కంటెంట్ పరంగా ఇప్పటివరకు పెద్దగా పాజిటివ్ కామెంట్స్ అందుకోకపోయినప్పటికీ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ పేరుతో మాత్రం ఈ సినిమాకు కావాల్సినంత బజ్ పెరిగింది. విడుదలైన టీజర్ ట్రైలర్ అంతంత మాత్రంగానే ఆకట్టుకున్నాయి. ఇక రామ్ చరణ్ ఉన్నాడు అని చీకట్లో బాణం వేయడంతో అది సినిమాకు బజ్ పెంచింది. కానీ ఇప్పుడు అతను లేడు అని తెలియడంతో అది మైనస్ అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు సినిమా లోకేష్ కనకరాజ్ మల్టీవర్స్ లో భాగమా? కాదా? అనే పాయింట్ కూడా అంచనాలను పెంచింది. మొత్తానికి గాసిప్స్ తోనే ఊహించని స్థాయిలో బజ్ అయితే పెంచుకుంది. ఇక కంటెంట్ అంచనాలకు తగ్గట్టుగా ఉంటేనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకోగలదు. ఏ మాత్రం తేడా వచ్చిన కూడా రెండవ రోజు తేడా కొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇక తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద టైగర్, భగవంత్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరి లియో కంటెంట్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.