ఫ్యామిలీ కిల్లర్‌ జాలీ 30 దేశాల ట్రెండింగ్‌

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుగురిని చంపేసిన ఆమె పై చాలా ఏళ్లు ఎవరికి అనుమానం కలుగలేదు.

Update: 2024-01-05 08:02 GMT

కేరళ కు చెందిన జాలీ జోసెఫ్‌ గురించి ఆ మధ్య దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తన ఫ్యామిలీ కి చెందిన వారిని, తన సొంత వారిని ఆమె తన విలాసాల కోసం, ఆస్తి కోసం, రెండో పెళ్లి కోసం చంపేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుగురిని చంపేసిన ఆమె పై చాలా ఏళ్లు ఎవరికి అనుమానం కలుగలేదు.

2002 నుంచి మొదలుకుని 2016 వరకు ఆమె మారణ కాండ కొనసాగుతూ వచ్చింది. కుటుంబ సభ్యులను ఏమాత్రం అనుమానం రాకుండా సైనేడ్‌ కలిపిన ఫుడ్‌ పెట్టి చంపి హత్య చేసిన జాలీ జోసెఫ్‌ కథ తో నెట్‌ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది.

గత వారం నుంచి నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ డాక్యుమెంటరీకి మంచి స్పందన లభిస్తోంది. సాధారణంగా డాక్యుమెంటరీస్‌ కి పెద్దగా స్పందన ఉండదు. కానీ జాలీ జోసెఫ్‌ గురించి తెలుసుకోవడం కోసం, ఆమె హత్యల విషయాలు తెలుసుకోవడం కోసం ప్రపంచంలోని 30 దేశాల నెట్‌ ఫ్లిక్స్ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

నెట్‌ ఫ్లిక్స్ కథనం ప్రకారం 30 దేశాల్లో ఈ డాక్యుమెంటరీ ట్రెండింగ్‌ లో ఉంది. చాలా మంది కూడా వారి వారి భాషల్లో జాలీ యొక్క మారణకాండ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ నెట్‌ ఫ్లిక్స్ లో లాగిన్‌ అవుతున్నారు. తమ కుటుంబంను నాశనం చేసిన జాలీ విషయం అసలు ఎలా బయట పడింది అనే విషయం తెలుసుకునేందుకు చాలా మంది ఈ డాక్యుమెంటరీ చూస్తున్నారు.

Tags:    

Similar News