రాసిపెట్టి ఉంటే వెతుక్కుంటూ రావడమంటే ఇదే!
ఇప్పటికీ జాతిరత్నం బ్రాండ్ తోనే ఇండస్ట్రీలో హైలైట్ అవుతుంది. 'మత్తువదలరా 2'తో మళ్లీ బ్యూటీ పేరు వినిపించింది.;

హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్ధులా గురించి పరిచయం అవసరం లేదు. 'జాతిరత్నాలు' సక్సస్ తర్వాత అమ్మడు మూడు ...నాలుగు అవకాశాలు వెంట వెంటనే అందుకుంది. కానీ వాటి పరాజయాలు మాత్రం రేసు నుంచి వెనక్కి నెట్టాయి. టాలీవుడ్ లో ఒక్కసారిగా అవకాశాలు కోల్పోయింది. ఇప్పటికీ జాతిరత్నం బ్రాండ్ తోనే ఇండస్ట్రీలో హైలైట్ అవుతుంది. 'మత్తువదలరా 2'తో మళ్లీ బ్యూటీ పేరు వినిపించింది.

కానీ కొత్త అవకాశాలు మాత్రం తెచ్చిపెట్టలేదు. ఇటీవలే కోలీవుడ్ పై కూడా దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా 'మయిల్' అనే సినిమాకు సంతకం చేసింది. ఇందులో విజయ్ ఆంటోని సరసన నటిస్తోంది. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే అమ్మడు ఓ బిగ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. స్టార్ హీరో తలపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లాను తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కొంత మంది తమిళ సోయగాల్ని పరిశీలించిన జాసన్ తాను రాసిన పాత్రకు ఫరియా పర్పెక్ట్ గా సూటవ్వడంతో? ఆమెని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇది నిజంగా ఫరియాకి గోల్డెన్ ఛాన్స్ అనాలి.
జాసన్ సంజయ్ తండ్రి వారతస్వాన్ని పుణికి పుచ్చుకుని హీరో అవుతాడు? అనుకుంటే అనూహ్యంగా అతడి ఆసక్తి ఫిల్మ్ మేకింగ్ అని తెలియడంతో? అంతా సర్ ప్రైజ్ అయ్యారు. దీంతో అతడి డెబ్యూ సినిమాలో హీరోయిన్ అవ్వాలని చాలా మంది భామలు ప్రయత్నించారు. కానీ ఎవరికీ పనవ్వలేదు. ఆ ఛాన్స్ ఫరియాకి వరించింది. రాసి పెట్టి ఉంటే? అవకాశం వెతుక్కుంటూ వస్తుంది? అనడానికి ఫరియా ఓ ఉదాహరణ.