టీజ‌ర్ టాక్: 40 కాదు 50 మందిని వేసేశా

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఇండియా తో పాటు ర‌ష్యా..పోలాండ్ లాంటి దేశాల్లో ఈ స్పై థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కించ‌డం విశేషం.

Update: 2024-03-16 11:30 GMT
టీజ‌ర్ టాక్: 40 కాదు 50 మందిని వేసేశా
  • whatsapp icon

బాలీవుడ్ న‌టుడు కం విల‌న్ సోనుసూద్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. న‌టుడిగా కంటే గొప్ప మాన‌వ‌తా వాదిగా ఫేమ‌స్ అయ్యాడు. కోవిడ్ స‌మ‌యంలో సోనుసూద్ అందించిన సేవ‌లు అంత గొప్ప పేరు తెచ్చి పెట్టాయి. తెలుగులో ఎన్నో సినిమాల్లో న‌టించిన సోనుభాయ్ ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నాడు. ఆయ‌న స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తూ 'ఫ‌తే' అనే సినిమా తెర‌కెక్కుతోంది.

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఇండియా తో పాటు ర‌ష్యా..పోలాండ్ లాంటి దేశాల్లో ఈ స్పై థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కించ‌డం విశేషం. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ని రిలీజ్ చేసారు. టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కు అనే ట్యాగ్ లైన్ ఓ బుల్లెట్ కింద‌పడుతుండ‌టా టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. 'మార్చి 19వ తేదీన నువ్వ 40 మందిని చంపేశావు ఒక‌డు అన‌గా..40 కాదు.. 50 మంది. అందులో 10 మంది శవాలు మీకు ఎప్పటికీ దొరకవు' అంటూ సోను సూద్ బ‌ధులిస్తాడు.

50 మందిని చంపావుగా.. ఏమైనా చెప్పాలని అనుకొంటున్నావా? అని మరొక‌రు అంటే? 'వారందరికి భగంతుడు శాంతి కలిగించాలని ప్రార్థిస్తాను' అని సమాధానం ఇస్తాడు. 'దాంతో నీవు చేసిన పని.. సరైనదే అని నీవు సమర్ధించుకొంటావా? అని ప్రశ్నించగానే.. సోను సూద్ తన చేతిలో రెండు పిస్టల్స్ తీసుకొని నడుచు కొంటూ.. ఎవడైతే పుట్టాడో వాడు చావడం తథ్యం. అదే సృష్టి రహస్యం అంటూ క‌ట్ చేసిన టీజ‌ర్ ఎంగేజింగ్ గా ఉంది.

స్పై కాన్సెప్ట్ కి గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యం అతికించిన‌ట్లు క‌నిపిస్తుంది. కేవ‌లం సంభాష‌ణ‌ల‌తోనే టీజ‌ర్ ని జ‌నాల‌కి ఎక్కించే ప్ర‌య‌త్నం ప్ర‌శంసనీయం.ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్- శక్తి సాగర్ ప్రొడక్షన్ బ్యానర్ లు నిర్మిస్తున్నాయి. ఇందులో జ్వాక్వలైన్ ఫెర్నాండేజ్.. శివజ్యోతి రాజ్‌పుత్ తదితరులు నటిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటాకర్ ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు.

Full View
Tags:    

Similar News