అతడిని హూ ఆర్ యూ అందా?
పాతిమా దంగల్ తో పాన్ ఇండియాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
ఏ నటికైనా తొలి సినిమా ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సినిమా హిట్ అయినా..ప్లాప్ అయినా ఫలితంతో సంబంధం లేకుండా ఆ సినిమాని ఓ జ్ఞాపకంగా పదిలం చేసుకుంటారు. ప్రతీ మూవ్ మెంట్ ని గుర్తుపెట్టుకుంటారు. మర్చిపోవడానికి అవకాశమే ఉండదు. కానీ 'దంగల్' బ్యూటీ ఫాతిమా సనా షేక్ మాత్రం హీరోయిన్ గా చేసిన తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడిని మర్చిపోయిందన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పాతిమా దంగల్ తో పాన్ ఇండియాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా విజయం తర్వాత బాలీవుడ్ లో బిజీ నటిగా మారిపోయింది. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతంచేసుకుంది. ఈ అమ్మడి పాస్ట్ లోకి వెళ్తే సక్సెస్ అంత ఈజీగా రాలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. అటుపై హీరోయిన్ గా తెలుగులో `నువ్వు నేను ఒకటవుదాం` అనే సినిమా చేసింది. ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. చిన్న సినిమా గా రిలీజ్ అవ్వడంతో ఫాతిమా తెలుగు సినిమా చేసింది? అన్న సంగతి పెద్దగా వెలుగులోకి రాలేదు.
అయితే అమ్మడు ఇప్పుడీ సినిమా సంగతులేవి తనకు గుర్తు లేనట్లుగానే ప్రవర్తిస్తుంది అన్న సంగతి ఆలస్యంగా తెలిసింది. ఇటీవలే ఈ సినిమాకి పనిచేసిన కెమెరా మ్యాన్ కి ముంబైలో ఫాతిమా తారసపడితే ఎలా ఉన్నారు మ్యాడం అని పలకరిస్తే? హూ ఆర్ యూ అనేసిందా? మీరు ఎవరో నాకు గుర్తు రావడం లేదు అని చెప్పిందిట. దీంతో సదరు కెమెరా మ్యాన్ మీ తెలుగు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ అని చెప్పుకోవాల్సిన సన్నివేశం ఎదురైందిట.
సినిమాలో అందంగా చూపించే ఛాయాగ్రాహకుడినే గుర్తు పెట్టుకోలేదు? అంటే మిగతా వాళ్ల పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. అంటే అమ్మడితో వ్యవహారం ఎరు దాటే వరకే తప్పె అవసరం. ఆ తర్వాత నీతో నాకు పనేంటి? అన్నట్లే కనిపిస్తుంది. ఫాతిమాలాంటి వాళ్లు ఇంకా చాలా మంది ఉంటారు అన్నది మరికొంత మంది టెక్నీషియన్ల అభిప్రాయంగా ఈ సందర్బంగా వెలుగులోకి వస్తోంది. గతంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో కూడా..ఇప్పుడు పాన్ ఇండియా హీరో కూడా ఇలాగే ఓ పాత్రికేయుడితో ప్రవర్తించినట్లు సమాచారం. తొలి ఇంటర్వ్యూ చేసిన ఆ సీనియర్ జర్నలిస్ట్ ని మీరు ఎవరో? నాకు తెలియదని స్టార్ అయిన తర్వాత తారస పడిన సందర్భంలో అన్నాడుట.