ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు..!

తెలంగాణా మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ, సమంతల మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Update: 2024-10-03 06:09 GMT

తెలంగాణా మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ, సమంతల మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బుధవారం ఆమె కేటీఆర్ వల్లే నాగ చైతన్య సమంత విడిపోయారని కామెంట్స్ చేయగా దీనిపై అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, సమంతలు స్పందిస్తూ ఫైర్ అయ్యారు. ఒక బాధ్యత గల మంత్రి అయ్యుండి వ్యక్తిగత జీవితాల మీద అలా ఎలా మాట్లాడతారని వారు మండిపడ్డారు. ఈ విషయంపై సినీ పరిశ్రమ కూడా భారీగా స్పందిస్తుంది.

మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక మహిళా మంత్రి అయ్యుండి అలా ఎలా మాట్లాడతారు.. ఆ మాటలు వింటుంటే చాలా బాధ అనిపించింది. ఎంతో సిగ్గు చేటుగా అనిపిస్తుందని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిమ్మల్ని ప్రజలు మంచి పాలన అందిస్తారని సమాజాన్ని వృద్ధి చేస్తారని ఎన్నుకున్నారు. అలాంటి మీరు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకోకండని అన్నారు. మీ లాంటి వాళ్లు భావితరాలకు ఉదహరణగా ఉండి మంచి పాలన అందించాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాదు. వెంటనే ఈ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని అన్నారు చిరంజీవి.

ఇదే విషయంపై అమల సైతం స్పందించారు. ఏకంగా రాహుల్ గాధీని నిలదీస్తూ మీ పార్టీలోని మహిళా నాయకురాలు ఎలా మాట్లాడుతున్నారో చూడండని ఆయనకు ట్యాగ్ చేశారు. ఓ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు అమల. ఈ ట్వీట్ ని రియాక్ట్ అవుతూ అమ్మా నువ్వు చెప్పింది నిజం. నీకు తోడుగా నేనుంటా.. నువ్వు ఇలాంటి నీచమైన వాటి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సారీ కానీ మనకు ఇది తపదు. అలాంటి వాళ్లను కంట్రోల్ చేయాలంటే మనం మాట్లాడాల్సిందే అని అఖిల్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఎన్ టీ ఆర్ కూడా ఫైర్ అయ్యారు. ఓ వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని ఇలా రాజకీయాల్లోకి లాగడం, వాడుకోవడం నీచమని అన్నారు. ఎంతో దిగజారుడుగా అనిపిస్తుంది. ఉన్నతమైన స్తానంలో ఉన్న వ్యక్ల్తి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎదుటి వారి ప్రైవసీకి గౌరవం ఇవ్వాలి.. మీరు మా ఇండస్ట్రీ వ్యక్తుల గురించి ఆధారాలు లేకుండా మాట్లాడటం బాధగా ఉంది. మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా అంటే ఇకపై మేము సైలెంట్ గా ఉండమని అన్నారు ఎన్టీఆర్.

ఈ విషయంపై నాని కూడా ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడి తప్పించుకోవచ్చని అనుకుంటున్నారు. ఇది చాలా దారుణం.. నీచం.. బాధ్యతాయుత పదవిలో ఉండి ఇలాంటి బేస్ లెస్ వాటిని ఎలా చెబుతారు. ఇది ఒక యాక్టర్ కి సంబందించిందని కాదు. మా సినిమా పరిశ్రమకు సంబందించింది. దీన్ని అందరు ఖండించాల్సిందే అని నాని ఫైర్ అవుతూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ఐతే సినీ పరిశ్రమ నుంచి స్పందన చూసి తను చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకున్నారు మంత్రి కొండా సురేఖ. అనుకోకుండా ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు.

Tags:    

Similar News