2024 దసరా ఇంత చప్పగానా?
సంక్రాంతి తర్వాత వచ్చే అతి పెద్ద పండుగ ఇదే. స్కూల్, కాలేజీలకు పది రోజులు సెలవులు ఇచ్చే సమయం ఇది. దీంతో ఏటా భారీ ఎత్తున స్టార్ హీరోల సినిమాల రిలీజ్ అవుతుంటాయి.
దసరా అంటే? తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో హడావుడి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి తర్వాత వచ్చే అతి పెద్ద పండుగ ఇదే. స్కూల్, కాలేజీలకు పది రోజులు సెలవులు ఇచ్చే సమయం ఇది. దీంతో ఏటా భారీ ఎత్తున స్టార్ హీరోల సినిమాల రిలీజ్ అవుతుంటాయి. థియేటర్లలో దసారా ధమాకాలు అంటూ సినిమాలు హల్చల్ చేస్తుంటాయి. అభిమానుల కోలాహాలంతో ఎంతో కళకళలాడుతాయి థియేటర్లు.
కానీ ఈసారి తెలుగు రాష్ట్రాల్లో దసరా చాలా చప్పగానే కనిపిస్తుంది. ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కిలేదు. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన `విశ్వం` రిలీజ్ అవుతుంది. ఇది చాలా కాలంగా సక్సెస్ లు లేని శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన సినిమా. సక్సెస్ పై వైట్ల మాత్రం చాలా కాన్పిడెంట్ గా ఉన్నాడు. గోపీచంద్ కి కూడా చాలా కాలంగా సరైన విజయాలు లేవు. అలాంటి ఇద్దరు ఈసారి దసరాకి ఎలాంటి రిజల్ట్ చూస్తారో చూడాలి.
అక్టోబర్ 11న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ ముందు రోజే అక్టోబర్ 10న మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `వెట్టయాన్` రిలీజ్ అవుతుంది. ఇది తెలుగు సినిమా కాదు..తమిళ సినిమా కాబట్టి. కాబట్టి దీన్ని పరిగణించాల్సిన పనిలేదు. కానీ సూపర్ స్టార్ మాత్రం పుల్ స్వింగ్ లో ఉన్నారు. వరుస విజయాల సమయంలో భారీ అంచనాల మధ్య వెట్టయాన్ రిలీజ్ అవుతుంది.
తెలుగులోనే కాదు..తమిళ్ లో కూడా రిలీజ్ అవుతోన్న ఒకే ఒక్క స్టార్ చిత్రమిది. ఇక బాలీవుడ్ కి వెళ్తే అక్కడా కొన్ని రాష్ట్రాల్లో దసరా భారీగానే జరుగుతుంది. పశ్చిమబెంగాల్, అస్సాం, ఒడిశా వంటి రాష్ట్రాలు ప్రముఖంగా జరుపుకునే పండగా. కానీ హిందీ సినిమాలు కూడా రిలీజ్ కి లేవు. అలియాభట్ నటించిన `జిగ్రా` అక్టోబర్ 2న రిలీజ్ అయింది. అక్టోబర్ 11న మాత్రం రాజ్ కుమార్ రావ్, త్రిప్తీడిమ్రీ జంటగా నటించిన `విక్కీ విద్యా కాహూ వాలా వీడియో` చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలే దసరా బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.