ఆ స్టార్ హీరో100 కోట్లు తీసుకున్నాడా?

అయితే ఈ హీరో మాత్రం వాళ్లంద‌రికీ భిన్నం. సినిమా లాభాల్లో వాటాలు తీసుకోడు. కేవ‌లం పారితోషికం మాత్ర‌మే సినిమా చేస్తాడు

Update: 2023-09-14 17:30 GMT

స్టార్ హీరోల పారితోషికాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్కొక్క‌రు కోట్ల‌లో ఛార్జ్ చేస్తున్నారు. కొంత మంది హీరోలు లాభాల్లో వాటా కూడా తీసుకునేలా ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. అంటే ఎలాంటి అడ్వాన్స్ తీసుకోకుండా త‌న పారితోషికాన్నే పెట్టుబ‌డిగా పెట్టి సినిమా చేస్తుంటారు. ఈ నేప‌థ్యంలో తమ సొంత బ్యాన‌ర్ పేరుతోనూ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మ‌ధ్య కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువైంది.

అయితే ఈ హీరో మాత్రం వాళ్లంద‌రికీ భిన్నం. సినిమా లాభాల్లో వాటాలు తీసుకోడు. కేవ‌లం పారితోషికం మాత్ర‌మే సినిమా చేస్తాడు. ఆ త‌ర్వాత సినిమా ప్లాప్ అయితే తిరిగి కొంత పారితోషికం తిరిగి చెల్లించే స్తాడు. అయితే ఇప్పుడా హీరోకి డ‌బ్బులు బాగా అవ‌స‌రం ప‌డ‌టంతో గ‌తంలో లో సినిమాలు చేసి పోయినా నిర్మాత‌ల‌కి తిరిగివ్వ‌డం లేదు. ఆ డ‌బ్బుని వేరే రూపంలో ఖ‌ర్చు పెడుతున్నారు.

తాజాగా ఆస్టార్ హీరో ఓ నిర్మాణ సంస్థ నుంచి ఏకంగా 100 కోట్లు తీసుకున్నారుట‌. ప్ర‌స్తుతం ఆ బ్యాన‌ర్లో ఆ హీరో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగ‌ని ఆ ఒక్క సినిమాకే 100 కోట్లు అనుకుని పొర‌బ‌డేరు. ఇంత భారీ మొత్తంలో హీరో తీసుకోవ‌డం వెనుక ఓ ప్యాకెజీ కోటాలో అంత అందుకున్న‌ట్లు స‌మాచారం. తాను ఉన్న ప‌రిస్థితుల్లో డ‌బ్బులు బాగా అవ‌స‌రం ప‌డ‌టంతో నిర్మాణ సంస్థ నుంచి 100 కోట్ల‌లో కొంత అప్పుగా తీసుకున్నాడుట‌.

దానికి సంబంధించి లీగ‌ల్ ఓ నోట్ కూడా రాసిచ్చారుట‌. ఒక‌వేళ తీసుకున్న అప్పుకి అస‌లు..వ‌డ్డి చెల్లించ‌క‌పోతే గ‌నుక అదే సంస్థ‌లో మ‌రో సినిమా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారుట‌. వాస్త‌వానికి ఆ ఆహీరో పారితోషంక 30 కోట్ల మ‌ధ్య‌లో ఉంటుంది. ఆలెక్క‌న చూసుకున్న ఆ సంస్థ‌తో మూడు సినిమాలు చేయాల్సి ఉంటుంది. ఇంకా ప‌ది కోట్లు ఇంకా సంస్థ‌కే చెల్లించాల్సి ఉంటుంది. కేవ‌లం ఆ హీరోపై న‌మ్మ‌కంతోనే సద‌రు నిర్మాణ సంస్థ అంత అప్పు రూపంలో ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఆ హీరో ఆ సంస్థ నుంచే కాదు టాలీవుడ్ లో ఇంకా త‌న‌కు బాగా తెలిసిన‌..త‌న‌ని బాగా న‌మ్మిన వ్య‌క్తుల నుంచి కూడా అత‌ను అప్పు రూపంలో తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇలా నిర్మాణ సంస్థ‌ల నుంచి అప్పుగా తీసుకునే బ‌ధులు బ్యాంక్ లో నే రుణాలు తీసుకోవ‌చ్చు గా అనొచ్చు. కానీ ఆ హీరో పేరిట కోట్ల‌లో ప్రాప‌ర్టీ లు ఏమీ లేవు. వాటిని చూపించే ప‌రిస్థితి లేదు. దీంతో ఇలా నిర్మాత‌ల నుంచి వ‌డ్డీకి తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News