ఫస్ట్ డే 100 కోట్లు కొల్లగొట్టిన టాప్ సినిమాలివే
ఇక మొదటిరోజు 50 కోట్లు ఆ తర్వాత 75 కోట్లు అనేవి ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి.
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. స్టార్స్ ఎప్పటికప్పుడు గత సినిమాలో రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త టార్గెట్లు ఫిక్స్ చేస్తున్నారు. ఇక మొదటిరోజు 50 కోట్లు ఆ తర్వాత 75 కోట్లు అనేవి ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. అగ్ర హీరోలు అయితే ఏకంగా 100 కోట్ల కలెక్ట్ చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నారు.
ఇక ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలే అత్యధిక స్థాయిలో మొదటి రోజు మంచి కలెక్షన్స్ అందుకునేవి. కానీ ఇప్పుడు వారి కంటే ఎక్కువ స్థాయిలో సౌత్ సినిమాలు అంతకుమించి అనేలా కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ప్రభాస్ సలార్ సినిమా కూడా మొదటి రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని టాప్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో నిలిచింది.
ఇక మొత్తంగా మొదటి రోజు అత్యధికంగా 100 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అందులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన టాప్ రెండు సినిమాలు బాహుబలి 2, RRR మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇక తర్వాత కన్నడ సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ డే 100 కోట్లకు పైగా కలెక్షన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక కోలీవుడ్లో ఎవరు ఆ రికార్డును మొదట ఆదుకుంటారా అని ఎదురుచూస్తున్న సమయంలో విజయ్ లియో సినిమా మొదటి రోజు 100 కోట్లు అందుకుంది. ఇక ఆ తర్వాత సలార్ సినిమా ఇప్పుడు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని టాప్ 10 లో స్తానం సంపాదించుకుంది. అనంతరం షారుక్ ఖాన్ జవాన్ సినిమా ఈ రికార్డును బాలీవుడ్ లో మొదట అందుకుంది.
ఇక ప్రభాస్ సాహో సినిమా కూడా బాహుబలి క్రేజ్ ఉపయోగించుకొని 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రీసెంట్గా సందీప్ రెడ్డివంగా రణబీర్ కపూర్ అనిమల్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే సెంచరీ కొట్టేసింది. ఇక ఆదిపురుష్ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ డే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.
మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు
1) RRR
2) బాహుబలి 2
3) KGF 2
4) లియో
5) సలార్
6) జవాన్
7) సాహో
8) యానిమల్
9) పఠాన్
10) ఆదిపురుష్