ఫస్ట్ డే టాప్ 10 కలెక్షన్స్.. గేమ్ ఛేంజర్ స్థానం ఎంత?

రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల వసూళ్లను అందుకున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.

Update: 2025-01-11 08:26 GMT

రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల వసూళ్లను అందుకున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాకపోయినా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సందడి గట్టిగానే కనిపించింది. కానీ కలెక్షన్లు ఏ రేంజ్ లో వచ్చాయి అనే విషయంలో మాత్రం సరైన క్లారిటీ లేదు. మేకర్స్ కాన్ఫిడెంట్ గానే ఉన్నప్పటికీ బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు మాత్రం వంద కోట్ల తేడా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక భారతీయ సినిమా వేదికపై ఇప్పటి వరకు సౌత్ సినిమాల డామినేషన్ గట్టిగానే కనిపించింది. మన సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై, అభిమానుల నుండి విశేష స్పందన అందుకుంటున్నాయి. ఇక శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఒరిజినల్ లెక్కలు మాత్రం కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇక గేమ్ ఛేంజర్ సంగతి పక్కనే పెడితే.. ఇప్పటివరకు విడుదలైన భారతీయ సినిమాల్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల్లో టాలీవుడ్ సినిమాలు 8 స్థానాలను ఆక్రమించాయి. మేకర్స్ చెప్పిన లెక్కలు ఒకవేళ నిజమైతే గేమ్ ఛేంజర్ టాప్ 10లో ఉంటుంది. అలాగే పుష్ప 2, RRR, బాహుబలి 2, సలార్ వంటి సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ లిస్ట్ టాలీవుడ్ యొక్క మార్కెట్ రేంజ్, ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తుంది.

టాలీవుడ్ మాత్రమే కాకుండా, ఇతర ఇండస్ట్రీలు కూడా తమ మార్కెట్‌ను విస్తరించడానికి ప్రయత్నిస్తుండగా, టాలీవుడ్ విజయాలు మిగతా పరిశ్రమలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచి, విభిన్నమైన కథలు, అత్యాధునిక నిర్మాణ ప్రమాణాలతో టాలీవుడ్ తన స్థాయిని మరింత పెంచుకుంటోంది. ఇప్పుడు ఈ టాప్ 10 జాబితాను పరిశీలిస్తే, మొదటి 7 స్థానాల్లో టాలీవుడ్ సినిమాలు మాత్రమే ఉండటం విశేషం. ఇతర ఇండస్ట్రీల నుండి కేవలం 2 సినిమాలు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు:

1. పుష్ప 2: 294 కోట్లు

2. RRR: 223 కోట్లు

3. బాహుబలి 2: 210+ కోట్లు

4. కల్కి 2898 AD: 191.5 కోట్లు

5. గేమ్ ఛేంజర్: 186 కోట్లు

6. సలార్: 178.7 కోట్లు

7. దేవర: 172 కోట్లు

8. KGF 2: 160+ కోట్లు

9. లియో: 148.5 కోట్లు

10. ఆదిపురుష్: 140 కోట్లు

Tags:    

Similar News