టాప్ గ్రాస్.. గేమ్ ఛేంజర్ స్థానం ఎక్కడ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి రాబోయే ‘గేమ్ చేంజర్’ కోసం ఓ వర్గం ఫ్యాన్స్ కొంత నమ్మకంతోనే ఉన్నారు.

Update: 2024-10-23 08:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి రాబోయే 'గేమ్ చేంజర్' కోసం ఓ వర్గం ఫ్యాన్స్ కొంత నమ్మకంతోనే ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నుంచి సోలో మూవీ వచ్చి మూడేళ్లు అవుతోంది. శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోందని పేరు తప్ప సినిమాపై చెప్పుకోదగ్గ బజ్ లేదు. 'ఇండియన్ 2' లాంటి డిజాస్టర్ తర్వాత శంకర్ బ్రాండ్ పైన కూడా పెద్దగా హోప్స్ లేవు. ఈ సినిమాపై మరల ప్రేక్షకులు దృష్టి పెట్టాలంటే కేవలం రామ్ చరణ్ వలన మాత్రమే సాధ్యం అవుతుంది.

'ఆర్ఆర్ఆర్' తో చరణ్ కి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ క్రియేట్ అయ్యింది. అయితే అది ఏ స్థాయిలో ఉందనేది 'గేమ్ చేంజర్' తోనే తెలుస్తుంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మూవీ భారీ కలెక్షన్స్ వస్తాయని నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కి ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. రా మచ్చా మచ్చా సాంగ్ సోషల్ మీడియాలో వినిపిస్తోన్న పెద్దగా ఇంప్రెస్ చేయలేదనే మాట వినిపిస్తోంది.

దీంతో మెగా ఫ్యాన్స్ అయితే 'గేమ్ చేంజర్' కోసం వెయిట్ చేస్తున్న మరీ ఎక్కువ నమ్మకాలు అయితే పెట్టుకోలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా 2025 జనవరి 10న సంక్రాంతి సీజన్ లో థియేటర్స్ లోకి వస్తుంది కాబట్టి ప్రేక్షకాదరణ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆ టైంలో వచ్చే పెద్ద హీరో మూవీ 'గేమ్ చేంజర్' ఒక్కటే కాబట్టి కచ్చితంగా మంచి వసూళ్లు రావొచ్చని అనుకుంటున్నారు.

ఈ కాంబినేషన్ కు అయితే 300 కోట్ల వరకు మార్కెట్ ఉంది. అయితే ఆ టార్గెట్ ను ఈ చిత్రం ఈజీ గా అందుకుంటుందని అనుకుంటున్నారు. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా 500+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. తెలుగులో టాప్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర ఏడో స్థానంలో ఉంది. ఎన్టీఆర్, తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో ఉంది. మరి రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఏ స్థానంలోకి వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బాహుబలి 2 - 1750 కోట్లు

ఆర్ఆర్ఆర్ - 1290 కోట్లు

కల్కి 2898ఏడీ - 1050 కోట్లు

సలార్ - 615 కోట్లు

బాహుబలి - 580 కోట్లు

సాహో - 420 కోట్లు

దేవర - 400 కోట్లు

పుష్ప - 390 కోట్లు

హనుమాన్ - 300 కోట్లు

ఆల వైకుంఠపురములో - 260 కోట్లు

Tags:    

Similar News