బ‌న్ని (X) చ‌ర‌ణ్ : డిసెంబ‌ర్ పుంజులు సై

సంక్రాంతి 2025 కి అగ్ర హీరోల మ‌ధ్య నువ్వా నేనా? అంటూ ఠ‌ఫ్ పోటీ ఉండ‌నుంది. అయితే అంత‌కుముందే, ఈసారి తెలుగు ప్రేక్ష‌కుల‌కు డిసెంబ‌ర్ లో స్పెష‌ల్ ట్రీట్ ఖ‌రారైంది

Update: 2024-09-25 03:18 GMT

సంక్రాంతి 2025 కి అగ్ర హీరోల మ‌ధ్య నువ్వా నేనా? అంటూ ఠ‌ఫ్ పోటీ ఉండ‌నుంది. అయితే అంత‌కుముందే, ఈసారి తెలుగు ప్రేక్ష‌కుల‌కు డిసెంబ‌ర్ లో స్పెష‌ల్ ట్రీట్ ఖ‌రారైంది. సంవ‌త్స‌రం ముగింపు నెల‌లో రెండు భారీ చిత్రాలు థియేటర్లలోకి వస్తాయనే దానిపై ఇప్పుడు చాలావ‌ర‌కూ స్పష్టత వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ పుష్ప 2 మాత్ర‌మే డిసెంబ‌ర్ రేసులో ఉంది అనుకున్న వారికి `గేమ్ ఛేంజర్` రాక‌ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రెండు పెద్ద సినిమాలు డిసెంబర్‌లో భారీ స్థాయిలో విడుదల కానున్నాయనేది తాజా అప్ డేట్.

రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` విడుదల తేదీపై ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా కానీ, ఇది క్రిస్మస్ 2024 సీజ‌న్‌లో 20 డిసెంబ‌ర్ 2024న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ఈ నెలాఖరులో పాటలు, టీజర్లు ఇతర ప్రచార సామగ్రిని విడుదల చేస్తార‌ని స‌మాచారం. ఈ వారాంతంలో ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నారు. కియ‌రా అద్వానీ కథానాయిక.

మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ `పుష్ప 2`ని 6 డిసెంబర్ 2024న విడుద‌ల చేస్తున్నారు. ఇరు సినిమాల‌కు కేవ‌లం వారాల గ్యాప్ ఉంటుంది. అయితే ఒకే సీజ‌న్ లో రెండు పెద్ద సినిమాల విడుద‌ల స‌రి కాదు అన్న నియ‌మం గురించి ప్ర‌స్థావిస్తే.. సినిమాలో కంటెంట్ ఉంటే రెండు సినిమాలు హిట్ అవుతాయ‌ని రామ్ చ‌ర‌ణ్ అన్నార‌ట‌. అలాగే `గేమ్ ఛేంజ‌ర్` రిలీజ్ తేదీ విష‌యంలో చ‌ర‌ణ్ చాలా క‌ఠినంగా ఉన్నార‌ని కూడా గుస‌గుస విన‌పిస్తుంది.

అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2`లో రష్మిక మందన్న కథానాయిక. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మెగాభిమానుల‌కు డిసెంబ‌ర్ లో ధ‌మాకా ట్రీట్ రెడీ గా ఉంద‌న్న‌మాట‌.

Tags:    

Similar News