బిగ్ బాస్ 8 : గౌతం విన్నింగ్ జర్నీ.. అవినాష్ కంప్లీట్ ఎంటర్టైనర్..!

బలమైన సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు అంటూ గౌతం గురించి బిగ్ బాస్ భారీ డైలాగ్స్ తో అతని గురించి ఆట గురించి సీజన్ 7 నుంచి నిష్క్రమించి సీజన్ 8 లో టైటిల్ రేసులో నిలబడ్డ తీరు గురించి చెప్పారు.

Update: 2024-12-13 05:56 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో గురువారం ఎపిసోడ్ ఓ పక్క హౌస్ మెట్స్ సరదా ఆటలతో పాటు ఇద్దరి కంటెస్టెంట్స్ ల జర్నీ వారికి చూపించారు. ముందుగా గౌతం ఏవీని చూపించారు బిగ్ బాస్. బలమైన సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు అంటూ గౌతం గురించి బిగ్ బాస్ భారీ డైలాగ్స్ తో అతని గురించి ఆట గురించి సీజన్ 7 నుంచి నిష్క్రమించి సీజన్ 8 లో టైటిల్ రేసులో నిలబడ్డ తీరు గురించి చెప్పారు. గౌతం కూడా తన మదర్ చెప్పిన మాట విన్నాను. సోలోగా ఉన్నా కాబట్టే ఇక్కడిదాకా వచ్చానని అన్నాడు.

గౌతం జర్నీ మొత్తం ఒక విన్నింగ్ జర్నీలా అనిపించింది. అతను ఆడిన ఆట.. గొడవపడ్డ సందర్భాలు.. ఎమోషనల్ ఫీలింగ్స్.. యష్మితో క్రష్ అన్న సందర్భం.. వాళ్ల అన్నయ్య హౌస్ లోకి వచ్చిన టైం.. ఇలా అన్నిటినీ చూపించారు. ఏవీ చూసిన గౌతం తల్లిదండ్రుల కోసం ఏదైనా చేయండి.. వారు చెప్పింది వినండి అన్నాడు. మణికంఠ సెల్ఫ్ ఎవిక్షన్ టైం లో డేంజర్ జోన్ లో ఉన్న గౌతం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్స్ కి వచ్చాడు. అతని గ్రాఫ్ చూసి అందరు సర్ ప్రైజ్ అయ్యారు.

ఇక రెండో ఏవీ అవినాష్ ది వేశారు. అవినాష్ జర్నీ కూడా ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉంది. ఒక కమెడియన్ గానే కాకుండా టాస్కుల్లో పర్ఫార్మ్ చేస్తూ కంప్లీట్ ఎంటర్టైనర్ గా ప్రూవ్ చేసుకున్నాడు అవినాష్. బిగ్ బాస్ కూడా అవినాష్ ని కంప్లీట్ ఎంటర్టైనర్ అయ్యాడు. తన జర్నీ చూసుకుని కమెడియన్స్ కి గెలిచే అర్హత లేదా అంటూ తనదైన మాటలతో ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడాడు అవినాష్.

గౌతం, అవినాష్ ఇద్దరి జర్నీలతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. నేడు మిగిలిన ముగ్గురి జర్నీ చూపించే ఛాన్స్ ఉంటుంది. ఇక శనివారం ఎపిసోడ్ లో టాప్ 5 లో ఒకరిద్దరికి ప్రైజ్ మనీ ఆశ చూపించి బయటకు పంపించే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ రాబోతుంది. ఈ ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా పుష్ప రాజ్ అదే అల్లు అర్జున్ రాబోతున్నాడని తెలుస్తుంది. నిఖిల్, గౌతం మధ్య విన్నర్ ఎవరన్నది టఫ్ ఫైట్ నడుస్తుంది. ఐతే ప్రేరణ మాత్రం తన ఆట తీరుతో థర్డ్ ప్లేస్ ఆ తర్వాత ప్లేస్ లో అవినాష్ ఉన్నారని తెలుస్తుంది.

Tags:    

Similar News