గుడ్ బ్యాడ్ అగ్లీ: షాకిస్తున్న తళా డ్రాగన్ అవతార్!
ఆసక్తికరంగా టైటిల్ కి తగ్గట్టే అతడిలోని మూడు రూపాలను తెరపై ఎలా చూపిస్తారో కానీ పోస్టర్ లో మాత్రం మాసీగా కనిపిస్తున్నాడు.
చేతులపై డ్రాగన్ టాటూలు.. పచ్చ చొక్కా నిండా గోల్డెన్ డ్రాగన్ లు.. తళా మార్క్ ఫంక్ హెయిర్ కట్ .. అతడి ముందు బెంచ్ పై తుపాకులతో ఆహార్యం చూస్తుంటే డాన్ లా ఉన్నాడు. పిమ్మిని బమ్మిగా మార్చే గ్యాంబ్లర్ లా కనిపిస్తున్నాడు. అసలు తళా అజిత్ అసలైన మాస్ అవతార్ కనిపిస్తోంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అని టైటిల్ పెట్టారు. కానీ అతడిలోని అగ్లీ సైడ్ ని గట్టిగానే చూపిస్తున్నట్టున్నారు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్. ప్రస్తుతం తళా అభిమానుల్లో వైరల్ గా మారుతోంది ఈ ఫస్ట్ లుక్ పోస్టర్.
పోస్టర్‌లో రంగురంగుల చొక్కా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానికి మించి పచ్చబొట్లు ఆకర్షణీయంగా మారాయి. అతడి ముందు బెంచ్ పై మారణాయుధాలు భయపెడుతున్నాయి. రకరకాల తుపాకులు లోడ్ చేయడానికి రెడీ చేసాడు. చేతి వేళ్లకు ప్రమాదకర ఆయుధం ధరించాడు. ఆసక్తికరంగా టైటిల్ కి తగ్గట్టే అతడిలోని మూడు రూపాలను తెరపై ఎలా చూపిస్తారో కానీ పోస్టర్ లో మాత్రం మాసీగా కనిపిస్తున్నాడు.
మార్చి 14న నిర్మాతలు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో టైటిల్ పోస్టర్‌ని విడుదల చేసారు. ఇది పూర్తిగా మాస్ చిత్రమని పోస్టర్ వెల్లడించింది. జూన్ 2024లో సినిమాని ప్రారంభించి 2025 పొంగల్‌కు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు. అతడు మాట్లాడుతూ, ''ప్రతి ఒక్కరి జీవితంలో కెరీర్‌లో వెలకట్టలేని క్షణాలు ఉంటాయి. ఇది నా నమ్మకానికి మించినది. నా ఆరాధ్య దైవం AK సార్‌తో కలిసి పనిచేయడం చాలా కాలం నాటి కోరిక. నేను అతడితో పని చేయడం చాలా ఎమోషనల్‌గా ఉంది. ఈ అవకాశం కల్పించిన నిర్మాతలు నవీన్ యెర్నేని సర్, రవిశంకర్ సర్ లకు ధన్యవాదాలు'' అని అన్నారు.
జాతీయ అవార్డు గ్రహీత స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రాఫర్ గా, విజయ్ వేలుకుట్టి ఎడిటర్ గా పని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్-రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో అజిత్ కుమార్ ఇతర ప్రముఖ తారాగణం పాల్గొంటున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.