అంబానీ ఇంట పెళ్లికి వెళ్లేవారు ఇలా ముస్తాబ‌వ్వాలి!

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తామని ముందే వెల్లడించింది.

Update: 2024-07-11 12:48 GMT

అంబానీ ఇంట పెళ్లి వేడుక తుది ఘ‌ట్టానికి చేరుకుంది. మ‌రికొన్ని గంట‌ల్లో అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చంట్ ల వివాహం జ‌ర‌గ‌నుంది. దీనిలో భాగంగా మూడు రోజుల వేడుక కోసం అంబానీ ఫ్యామిలీ డ్రెస్ కూడా విధించింది. క్రూజ్‌ పార్టీకీ ఏ విధంగా డ్రెస్‌ కోడ్ పెట్టారో? అదే విధంగా 12, 13, 14 తేదీల‌కు సంబంధించి అదే రూల్ ఫాలో అవుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తామని ముందే వెల్లడించింది.

మూడు రోజులు అతిథులంతా ఇండియన్ స్టైల్‌ డ్రెస్‌లలోనే కనిపించనున్నారు. జులై 12వ తేదీన `శుభ్ వివాహ్` వేడుక జ‌రుగుతుంది. ఆ రోజు అతిథులు కచ్చితంగా భారతీయ సంప్రదాయ దుస్తులనే ధరించాలి. మగవారు పంచెలు, చొక్కాలు ధ‌రించాలి. లెహంగా సూట్లు, జాతి సూట్లు, కుర్తా పైజ‌మాలు, షేర్వాణీలు వేసుకుంటారు. ఆడవాళ్లు చీరలు కట్టుకోవాలి. వాటితో పాటు భార‌తీయ సంప్ర‌దాయం క‌నిపించే ఇత‌ర వ‌స్త్రాలు ధ‌రించ‌వ‌చ్చు.

ఇక మ‌రుస‌టి రోజు అంటే జులై 13 `శుభ్ ఆశీర్వాద్ లేదా డివైన్ బ్లెస్సింగ్` కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. ఆ రోజున ఇండియన్ ఫార్మల్‌ డ్రెస్‌ కోడ్‌ ఫాలో అవ్వాలి. అతిథులంతా క్లాసిక్, ఫార్మల్ చీరలు, కుర్తా సెట్‌లు, హిప్ కోట్లు, ఇండో-వెస్ట్రన్ సూట్‌లు మొదలైన వాటిని ధరించాలి. ఇక ముగింపు రోజైన జులై 14న `మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్` కోసం ఇలా ముస్తాబ‌వ్వాలి.

ఇండియ‌న్ చిక్ థీమ్‌లో అతిథులు డ్రెసప్ అవ్వాలి. అంటే...ఇండియన్ టచ్‌ ఇస్తూ మోడ్రన్ డ్రెస్‌లు వేసుకోవచ్చు. స్టైలిష్ లెహంగాలు, ఆధునిక చీర‌లు ధ‌రించ వ‌చ్చు. ఇది సమకాలీన ఫ్యాషన్‌తో భారతీయ సాంప్రదాయ అంశాల కలయిక సూచి. ఆ రోజు నిబంధ‌న‌లు పెద్ద‌గా వ‌ర్తించ‌వు. ఇలా మూడు రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో విధంగా డ్రెస్‌కోడ్ పెట్టారు.

Tags:    

Similar News