చివరి రోజు గుంటూరు కారం.. ఫైవ్ షోస్ హౌస్ ఫుల్..!
ఈ ఇయర్ మొదట్లో సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం హంగామా తెలిసిందే.
ఈ ఇయర్ మొదట్లో సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం హంగామా తెలిసిందే. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మరోసారి సూపర్ స్టార్ స్టామినా ప్రూవ్ చేసేలా వసూళ్లు రాబట్టింది. సినిమాలో త్రివిక్రం మార్క్ మ్యాజిక్ లేదని అనిపించినా కూడా రమణ పాత్రలో మహేష్ అదరగొట్టాడు. ఇక థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. 2024 సంక్రాంతికి ఫ్యాన్స్ కి ట్రీట్ అందించిన ఈ సినిమా ఇయర్ ఎండింగ్ ట్రీట్ కి సిద్ధమయ్యింది. గుంటూరు కారం సినిమాను డిసెంబర్ 31న హైదరాబాద్ లో ఐదు స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు.
సెలెక్టెడ్ థియేటర్ లో ఈ ఐదు షోస్ ప్లాన్ చేయగా ఇలా టికెట్స్ పెట్టారో లేదో అలా బుకింగ్స్ పూర్తయ్యాయి. రీ రిలీజ్ ట్రెండ్ ఒకప్పటి సినిమాలకే కాదు లేటెస్ట్ సినిమాలకు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ వన్ మ్యాన్ షో చేసిన గుంటూరు కారం సినిమాను మరోసారి తెర మీద చూసేలా ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. గుంటూరు కారం డిసెంబర్ 31న ఐదు షోస్ వేయగా హా**ట్ కేకుల్లా ఐదు షోస్ టికెట్స్ క్షణాల్లో బుక్ అయ్యాయి.
ఐతే ఈ దూకుడు చూస్తుంటే ఏపీ, తెలంగాణాలో ఇంకొన్ని సీన్స్ యాడ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్న ఈ ట్రెండ్ మిగతా స్టార్స్ ని కూడా ఫాలో అయ్యేలా చేస్తుంది. మహేష్ గుంటూరు కారం సినిమా లో మహేష్ డ్యాన్స్ లో కూడా అదరగొట్టాడు. తన డ్యాన్స్ గురించి ఇదివరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకున్న మహేష్ ఇక మీదట డ్యాన్స్ లో కూడా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేస్తున్నాడు.
గుంటూరు కారం స్పెషల్ షోస్ కి క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. ఇంకా షోస్ పెంచే ఆలోచన చేస్తారేమో చూడాలి. ఇక మహేష్ ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ పూర్తిస్థాయి మేకోవర్ చూడబోతున్నామని తెలుస్తుంది. ఇప్పటికే లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో మహేష్ క్రేజీ లుక్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. రాజమౌళి సినిమాతో మహేష్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా చెబుతున్నారు.