గుంటూరు కారం మసాలా ఘాటు బాగానే ఉంది..!

మహేష్ తో ఇదివరకు అతడు, ఖలేజా సినిమాలు చేసిన త్రివిక్రం రెండు డిఫరెంట్ సినిమాలుగా చేశాడు.

Update: 2023-11-10 16:30 GMT

సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తుంది గుంటూరు కారం. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా బిర్యాని సాంగ్ రీసెంట్ గా రిలీజైంది. ఈ సాంగ్ చూశాక సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అర్ధమైంది ఏంటంటే మహేష్ కెరీర్ లో ఫుల్ లెంగ్త్ మాస్ మూవీగా ఈ సినిమా వస్తుందని ఫిక్స్ అయ్యారు.

ప్రచార చిత్రాల్లో లుంగి కట్టి, బెడీ తాగడం ఇలా మహేష్ ని ఒక కామన్ మ్యాన్ గా మాస్ పాత్రలో చూపిస్తున్నాడు త్రివిక్రం. సినిమా కథ కథనాలు ఎలా ఉన్నా పాత్రలు వాటి స్వభావాలు మాటలతో త్రివిక్రం ప్రేక్షకులను కట్టి పడేస్తాడు. మహేష్ గుంటూరు కారం సినిమాలో కూడా అదే రేంజ్ లో తన స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ అదనంగా మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేలా చేస్తున్నారట.

మహేష్ తో ఇదివరకు అతడు, ఖలేజా సినిమాలు చేసిన త్రివిక్రం రెండు డిఫరెంట్ సినిమాలుగా చేశాడు. ఇక ఇప్పుడు 3వ సినిమాను కూడా మహేష్ ని ఇప్పటివరకు ఫ్యాన్స్ చూడని మాస్ యాంగిల్ లో చూపించాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆ క్యారెక్టరైజేషన్ ని గుర్తు చేసేలా సినిమాకు గుంటూరు కారం అని టైటిల్ పెట్టారు. ఇక దం మసాలా బిర్యాని సాంగ్ కూడా సినిమా పై భారీ అంచనాలు ఏర్పరచింది. సినిమా తప్పకుండా ఫ్యాన్స్ కే కాదు ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా త్రివిక్రం ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న మాస్ సినిమాగా గుంటూరు కారం చెప్పుకోవచ్చు. సినిమా టార్గెట్ మిస్ అవ్వకూడదని చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో త్రివిక్రం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారట. హ్యాట్రిక్ సినిమా సెన్సేషనల్ హిట్ చేయాలని చూస్తున్న త్రివిక్రం మహేష్ కాంబో ఫ్యాన్స్ కి ఎలాంటి సినిమా అందిస్తారో చూడాలి. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా లైన్ లో ఉండగా.. అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు త్రివిక్రం. గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. అల వైకుంఠపురములోతో సెన్సేషనల్ హిట్ అందుకున్న త్రివిక్రం గుంటూరు కారంతో కూడా పెద్ద టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News