హారిక అండ్ హాసిని, సితార బ్యానర్.. లైనప్ చూస్తే షాకే..
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు.. తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు.. తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందిన జులాయితో మొదలైన నిర్మాత రాధాకృష్ణ జర్నీ.. సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆ తర్వాత ఆయన బాటలోనే నాగవంశీ.. సితార బ్యానర్ పై మూవీస్ నిర్మిస్తున్నారు.
రెండు బ్యానర్ల పేర్లు వేర్వేరైనా.. వర్క్ ఒకేలా ఉంటుంది. కంటెంట్ విషయంలో జాగ్రత్త కచ్చితంగా కనిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు హారిక అండ్ హాసిని, సితార సంస్థల లైనప్ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. 2025 నుంచి రాబోయే రెండు మూడు ఏళ్లు.. వరుస సినిమాలను రిలీజ్ చేయనున్నాయి. ఓ రేంజ్ లో సందడి చేయనున్నాయి. సుమారు 18 చిత్రాలను తీసుకురానున్నాయి రెండు సంస్థలు.
అయితే ఆ రెండు సంస్థల చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూసుకుంటే.. ఫస్ట్ బాలయ్య మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా నాగవంశీ కూడా సినిమాలో బాలయ్య లుక్ చాలా కొత్తగా ఉంటుందని తెలిపి భారీ హైప్ క్రియేట్ చేశారు.
మరోవైపు గౌతమ్ తిన్ననూరి.. సితార బ్యానర్ పై రెండు చిత్రాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కొత్త క్యాస్టింగ్ తో మేజిక్.. విజయ్ దేవరకొండ తో VD 12 చిత్రాలు తీస్తున్నారు. రెండు మూవీలు కూడా లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ మూవీని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మాస్ మహారాజా రవితేజ.. మాస్ జాతర మూవీ కూడా సమ్మర్ లోనే రానుంది. మే 9న విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాట్రోగ్రాఫర్ రవి కె చంద్రన్ దర్శకత్వంలో తమర మూవీని మూడేళ్ల క్రితం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పట్టలెక్కని ఆ మూవీ షూటింగ్ త్వరలో మొదలు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ చిత్రకరణ కూడా స్టార్ట్ కానున్నట్లు వినికిడి.
వీటితోపాటు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మూవీ, జాతిరత్నాలు అనుదీప్ ఫేమ్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్ సినిమా, ఆదిత్య హాసన్ నేతృత్వంలో ఆనంద్ దేవరకొండ చిత్రం, సిద్దు జొన్నలగడ్డ కోహినూర్ ప్రాజెక్టు, కళ్యాణ్ శంకర్ సూపర్ హీరో ఫిల్మ్ కూడా రెండు బ్యానర్లపై రూపొందనున్నాయి. సూర్య, మోక్షజ్ఞ, అల్లరి నరేష్, సిద్దు జొన్నలగడ్డ, అశోక్ గల్లాతో చెరో మూవీ చేయనున్నాయి. మరి రెండు నిర్మాణ సంస్థలు ఫ్యూచర్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటాయో వేచి చూడాలి.