హనుమాన్.. టోటల్ బడ్జెట్ ఎంతంటే?
ఈ మూవీకి ఏకంగా 42 కోట్లు బడ్జెట్ పెట్టారంట. కథ మీద నమ్మకంతోనే ఈ స్థాయిలో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొట్టమొదటి సూపర్ హిట్ చిత్రంగా హనుమాన్ వస్తోంది. తేజ సజ్జా ఈ చిత్రంలో హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్ తేజకి అక్కగా నటిస్తోంది. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వినయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది.
తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా సంక్రాంతికి విజువల్ ఫీస్ట్ గా హనుమాన్ ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. చిత్ర యూనిట్ కూడా మూవీ సక్సెస్ మీదా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే చిన్న సినిమాని సంక్రాంతి రేసులో పెద్ద సినిమాల మధ్య ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటూ కొంతమంది జర్నలిస్టులు హనుమాన్ సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడారు.
దానికి తగ్గట్లుగానే ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ కౌంటర్ ఇచ్చారు. మేము చిన్నవాళ్ళం కాని మా సినిమా చిన్నది కాదు అని క్లారిటీ ఇచ్చారు. హనుమాన్ అనే పేరు మా సినిమాకి బలం అందుకే సంక్రాంతి రేసులో ఉన్నామని చెప్పారు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి ఏకంగా 42 కోట్లు బడ్జెట్ పెట్టారంట. కథ మీద నమ్మకంతోనే ఈ స్థాయిలో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఇప్పటికే మూవీకి పెట్టిన పెట్టుబడిలో మెజారిటీ రికవరీ అయిపొయింది. అలాగే థీయాట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగిందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే జనవరి 12న హనుమాన్ కి గట్టి పోటీ ఇచ్చే మూవీ ఏదీ రావడం లేదు. హనుమాన్ సెంటిమెంట్ కూడా అక్కడ బలంగా ఉంటుంది.
ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత ప్రశాంత్ వర్మ పక్కా ప్లానింగ్ తోనే అందరికంటే ముందుగానే సంక్రాంతి 12న రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు బుక్ మై షోలో చూసుకుంటే సంక్రాంతి సినిమాలలో గుంటూరు కారం తర్వాత అత్యధిక ఇంప్రెషన్స్ హనుమాన్ కి ఉన్నాయి. దీనిని బట్టి సినిమా కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.