హిందీలో పెరుగుతున్న హనుమాన్ స్పీడ్

అలాగే హిందీ బెల్ట్ లో ఈ మూవీ రెండోకి కలెక్షన్స్ డబుల్ అయ్యాయి. మూడో రోజు 6 కోట్లకి పైగా వసూళ్ళని దక్కించుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Update: 2024-01-15 06:22 GMT

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో మూవీ హనుమాన్ ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటుంది. మౌత్ టాక్ తోనే సినిమా జనాల్లోకి బలంగా వెళ్తోంది. సంక్రాంతి రేసులో వచ్చిన మిగిలిన సినిమాల కంటే బెటర్ గా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది.

ఈ సినిమా శనివారం 12.45 కోట్లు రెండో రోజైన శనివారం కలెక్ట్ చేసింది. మొదటి రోజు కంటే 55 శాతం ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో కలెక్షన్స్ కూడా క్రమంగా పెరిగింది. ఇక ఆదివారం కూడా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం 15 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

అలాగే హిందీ బెల్ట్ లో ఈ మూవీ రెండోకి కలెక్షన్స్ డబుల్ అయ్యాయి. మూడో రోజు 6 కోట్లకి పైగా వసూళ్ళని దక్కించుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నార్త్ ఇండియాలో మూవీకి ఆదరణ పెరగడంతో థియేటర్స్ సంఖ్య కూడా పెరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా థియేటర్స్ పెరిగినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబం అంతా కలిసి చూడగలిగే విధంగా హనుమాన్ సినిమా ఉండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి. హనుమాన్ స్పీడ్ ఎంత వరకు కొనసాగుతుంది, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది. ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కూడా హనుమాన్ సక్సెస్ పట్ల రెస్పాన్స్ వస్తూ ఉండటం విశేషం.

రాఘవేంద్ర రావు, ఆర్జీవీ లాంటి దర్శకులు హనుమాన్ సక్సెస్ పై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంతో తేజా సజ్జా ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ని తెచ్చేసుకోవడం విశేషం. చాలా కాలం తర్వాత నార్త్ ఇండియాలో కూడా ఒక తెలుగు మూవీ సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతూ ఉందని అక్కడి ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News