ఓవర్సీస్ లో హనుమాన్ కు భారీ టార్గెట్.. కొట్టేస్తారా?

కొన్ని సినిమాలు.. దర్శకుడి బ్రాండ్ తోనే దూసుకెళ్తుంటాయి. తాజాగా టాలీవుడ్ లో హనుమాన్ సినిమా గురించి ఇలాంటి చర్చే జరుగుతోంది.

Update: 2024-01-07 10:32 GMT

కొన్ని సినిమాలు.. దర్శకుడి బ్రాండ్ తోనే దూసుకెళ్తుంటాయి. తాజాగా టాలీవుడ్ లో హనుమాన్ సినిమా గురించి ఇలాంటి చర్చే జరుగుతోంది. యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న హనుమాన్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకున్నాయి. కచ్చితంగా సినిమా చూడాల్సిందేనన్న హైప్ క్రియేట్ చేశాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు థియేటర్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నా.. రిలీజ్ సమయానికి పరిస్థితులు మారే ఛాన్స్ ఉంది.

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ మీడియం రేంజ్ హీరోకు తీసుపోని రీతిలో హనుమాన్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే జనవరి 12న మహేశ్ గుంటూరు కారం రిలీజ్ ఉన్నప్పటికీ.. హనుమాన్ మీద మైత్రీ వాళ్లు భారీ బడ్జెట్ పెట్టినట్లే. ఏపీలో కూడా ఇదే రేంజ్ బిజినెస్ జరుగుతుంది. అక్కడ కూడా దాదాపు రూ.13 కోట్ల వరకు హనుమాన్ సినిమాను అమ్మేశారు.

మరోవైపు, ఓవర్సీస్ లో హనుమాన్ మూవీ 500 థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం. ఓవర్సీస్ లో ఈ స్థాయి థియేటర్లు అంటే రికార్డ్ అనే చెప్పాలి. హనుమాన్ ను అక్కడ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణా సినిమాస్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. ఓవర్సీస్ లో 5లక్షల డాలర్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవాలంటే మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంది.

అయితే ఫస్ట్ వీక్ లోనే ఈ మూవీ మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వాన ఫేమ్ విన‌య్ రాయ్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో విడుదల కానుంది.

Tags:    

Similar News