హనుమాన్.. ఓటీటీ దర్శనం ఎప్పుడంటే..

చిన్న సినిమాగా థియేటర్లోకి వచ్చి బిగ్ సక్సెస్ అందుకున్న హనుమాన్ సినిమా నాన్ వీకెండ్స్ లో కూడా మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటుంది

Update: 2024-01-29 11:31 GMT

చిన్న సినిమాగా థియేటర్లోకి వచ్చి బిగ్ సక్సెస్ అందుకున్న హనుమాన్ సినిమా నాన్ వీకెండ్స్ లో కూడా మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా సంక్రాంతి పోటీలో మిగతా సినిమాలను డామినేట్ చేసే విధంగానే హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది. ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళింది.

ఇటీవల కాలంలో పెట్టిన పెట్టుబడికి అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ అందించిన సినిమాలలో హనుమాన్ కూడా టాప్ లిస్టులో చేరిపోయింది. సినిమాపై బిజినెస్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ స్థాయిలోనే లాభాలను అందించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరపైకి తీసుకువచ్చిన విధానం సినిమాకు పాజిటివ్ టాక్ ను క్రియేట్ చేసింది.

మొదట్లో తక్కువ ధియేటర్లు దొరికినప్పటికీ ఆ తర్వాత మౌత్ టాక్ ద్వారా సినిమా కలెక్షన్స్ పెరుగుతూ వెళ్లాయి. సినిమా కంటెంట్ క్లిక్ అయితే ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో హనుమాన్ సినిమా రుజువు చేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్స్ కోసం ఓ వర్గం ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

మరోసారి ఓటీటీ లో చూడాలి అని ఆ డేట్ గురించి ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీలో ఫిబ్రవరి రెండో వారంలో నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదట జనవరి చివరిలోనే ఈ సినిమా ఓటీటీ లోకి రావచ్చు అని పలు రకాల వార్తలు వచ్చాయి. కానీ సినిమా తప్పనిసరిగా ఫిబ్రవరి మొదటి వారం వరకు థియేటర్లలో కొనసాగాలి అని నిర్మాతలు డీల్ సెట్ చేసుకున్నారు.

ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఇక తెలుగులోనే కాకుండా హిందీలో కూడా అలాగే మిగతా భాషల్లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఓటీటీ లో కూడా ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి హనుమాన్ అటువైపు నుంచి ఏ రేంజ్ లో రెస్పాన్స్ అందుకంటుందో. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను రూపొందించే విధంగా అడుగులు వేస్తున్నారు.

Tags:    

Similar News