తెలుగు 'హనుమాన్‌' మిస్సింగ్ అసలు విషయం..!

ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఏ సంక్రాంతి సినిమా కూడా వసూళ్లు చేయని మొత్తంను హనుమాన్ దక్కించుకున్నాడు

Update: 2024-03-18 06:13 GMT

2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డ్‌ స్థాయి వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే. సంక్రాంతి సినిమాల్లో అతి పెద్ద విజయంగా హనుమాన్ నిలిచింది. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఏ సంక్రాంతి సినిమా కూడా వసూళ్లు చేయని మొత్తంను హనుమాన్ దక్కించుకున్నాడు.

అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హనుమాన్ సినిమాను థియేటర్ లో చూడలేక మిస్ అయిన వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ సినిమా 50 రోజులు దాటింది.. రెండు నెలలు దాటినా కూడా స్ట్రీమింగ్ అవ్వక పోవడం పట్ల ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు హనుమాన్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు అయ్యింది. హిందీ వర్షన్ ను జియో సినిమాలో స్ట్రీమింగ్ చేస్తుండగా, తెలుగు వర్షన్ ను జీ5 లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. రెండు వర్షన్ లకు 8 నిమిషాల నిడివి తేడా ఉండటం గమనించి నెటిజన్స్ చర్చ మొదలు పెట్టారు.

తెలుగు వర్షన్ లో 2 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉండటం, హిందీ వర్షన్ లో మాత్రం 2 గంటల 38 నిమిషాలు ఉండటంతో ఏదో మిస్సింగ్‌ అనే చర్చ మొదలు అయ్యింది. తెలుగు వర్షన్ తో పోల్చితే హిందీ వర్షన్ లో కొత్త ఫుటేజ్ ఏమైనా యాడ్‌ చేసి ఉంటారేమో అని చాలా మంది హిందీ లో కూడా చూశారు.

అసలు విషయం ఏంటంటే ఫ్రేమ్‌ రేట్‌ మార్చడం ద్వారా రన్ టైమ్ మారింది.. అంతే తప్ప హనుమాన్‌ హిందీ వర్షన్ లో ఒక్క సీన్ కానీ, పాట కానీ ఎక్కువ లేదు అని తేలిపోయింది. తెలుగు ప్రేక్షకులు కంగారు పడాల్సిన పని లేదు.. హిందీ వర్షన్ ను భాష రాకున్నా చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు.

హిందీ వర్షన్‌ ను సాధారణ ఫ్రేమ్ రేట్‌ తో స్ట్రీమింగ్‌ చేయడం ద్వారా కాస్త రన్‌ టైమ్ ఎక్కువ వస్తుంది. దీని వల్ల క్వాలిటీ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తెలుగు లో మాత్రం థియేటర్ లో ఎలా అయితే ఫ్రేమ్ రేట్ తో ప్లే అయ్యిందో అలాగే జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిన్న టెక్నికల్ ఇష్యూ తెలియని వారు నానా హైరానా పడుతున్నారు.

Tags:    

Similar News