హీరో, హీరోయిన్ ఏజ్ ఫ్యాక్టర్ పై హరీష్ కౌంటర్
అయితే సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ కి కౌంటర్లు కూడా విపరీతంగా వచ్చాయి.
మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినపుడు సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని ట్రోల్ చేశారు. దాంతో పాటు హరీష్ శంకర్ మీద విమర్శలు చేశారు. 56 ఏళ్ళ హీరో 25 ఏళ్ళ హీరోయిన్ మధ్య ఆ రొమాంటిక్ సాంగ్ ఏంటి అంటూ ప్రశ్నించారు. కావాలని దీనిని కొందరు వివాదంగా చేయాలని అనుకున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ కి కౌంటర్లు కూడా విపరీతంగా వచ్చాయి. దీంతో కొద్ది రోజుల తర్వాత ఈ ట్రోలింగ్ ఆగిపోయింది.
తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ ఈ ట్రోలింగ్స్ కి కౌంటర్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మిస్టర్ బచ్చన్ మూవీలో హీరో, హీరోయిన్స్ మీద వచ్చిన ట్రోలింగ్ గురించి జర్నలిస్ట్ అడిగారు. అదే సమయంలో ధమాకా సినిమాకి కూడా రవితేజ, శ్రీలీల మధ్య ఇలాగే ఏజ్ ఫ్యాక్టర్ చూపించి ట్రోల్ చేశారు. ఆ మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారని జర్నలిస్ట్ గుర్తుచేశారు.
దీనికి హరీష్ శంకర్ రియాక్ట్ అవుతూ మన ఇంట్లో ఆడపిల్లకి పెళ్లికొడుకు కోసం అయితే ఏజ్ అనేది చూస్తాం. అలాగే నక్షత్రం, గోత్రం లాంటివి చూసుకుంటారు. కానీ ఇది సినిమా. హీరోకి ఎంత ఏజ్ ఉంటే ఆ వయస్సు ఉన్న పాత్రలు మాత్రమే చేయరు కదా… సినిమాలో హీరో క్యారెక్టర్ కి స్క్రీన్ ఏజ్ ఒకటి ఉంటుంది. దానికి తగ్గట్లుగానే నటిస్తారు. సినిమాలో వారు చేస్తుంది యాక్టింగ్ మాత్రమే.
అలా కాకుండా ఇది సినిమా.. వారు చేస్తుంది యాక్టింగ్ అనే కామన్ సెన్స్ కూడా లేకుండా కొంతమంది విమర్శలు చేస్తారు. అయిన హీరోయిన్ గా చేసిన ఆవిడకి లేని ఇష్యూ మీకేంటి… ఆవిడ ఇష్టపడే సినిమాని ఒప్పుకుంది కదా అని కౌంటర్ ఇచ్చారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి జోడీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. అప్పుడు ఎవరు ఏజ్ ఫ్యాక్టర్ ని చూడలేదు.
సినిమాని సినిమాలా చూస్తే ఏజ్ గురించి ఆలోచన రాదని హరీష్ శంకర్ ట్రోలింగ్ చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ మూవీ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకొస్తుంది. సుమారు ఐదేళ్ల తర్వాత హరీష్ శంకర్ ఈ సినిమా చేస్తున్నారు. మూవీపైన కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి రవితేజ, హరీష్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది చూడాలి.