హరీష్ శంకర్ మెగా మూవీ నెక్స్ట్ లెవెల్ అంతే..!
అయితే సినిమాల వేగం విషయంలో కాస్త ఆడియన్స్ నొచ్చుకునేలా చేస్తున్నా కొడితే హిట్టు పడాల్సిందే అన్న విధంగా హరీష్ శంకర్ సినిమాలు వస్తున్నాయి
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ తన 18 ఏళ్ల కెరీర్ లో తీసిన సినిమాలు ఏడు మాత్రమే అయినా కూడా ఆయన ఆడియన్స్ లో ఏర్పరచిన ఇంపాక్ట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా తాను ఎంచుకున్న హీరో మాస్ స్టామినాను ఆడియన్స్ విజిల్స్ వేసేలా చూపించడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించేలా చేస్తారు. అయితే సినిమాల వేగం విషయంలో కాస్త ఆడియన్స్ నొచ్చుకునేలా చేస్తున్నా కొడితే హిట్టు పడాల్సిందే అన్న విధంగా హరీష్ శంకర్ సినిమాలు వస్తున్నాయి.
హరీష్ శంకర్ చివరి సినిమా 2019 లో వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ అంటూ కోలీవుడ్ సినిమా జిగర్తండా రీమేక్ తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఛాన్స్ వచ్చినా అది ఇంకా సెట్స్ మీద ఉంది తప్ప పూర్తి కాలేదు. ఈ ఇయర్ పవన్ ఓజీ, వీరమల్లు సినిమాలు పూర్తి చేసే సరికి టైం సరిపోతుంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ ఇయర్ లోనే మళ్లీ షూటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం హరీష్ శంకర్ మాస్ మహరాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. మిస్టర్ బచ్చన్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కానుంది. అయితే పవన్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే లోగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ప్రపోజల్ లో ఉన్నాడు హరీష్ శంకర్. పీపుల్ మీడియా ఫ్యాకరీ ఈ సినిమా నిర్మిస్తుంది.
చిరుతో సినిమా అనేది ప్రతి ఒక్క దర్శకుడి కల. ముఖ్యంగా మెగా వీరాభిమాని అయిన హరీష్ శంకర్ కి ఈ ఛాన్స్ చాలా గొప్పది. అందుకే చిరు తో సినిమా అలా ఇలా కాదు నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ పూర్తి అవ్వడమే ఆలస్యం చిరు సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ అవ్వాలని ఫిక్స్ అయ్యాడట. సినిమా లైన్ ఆల్రెడీ చిరుని ఇంప్రెస్ చేయగా దాన్ని బ్లాక్ బస్టర్ కొట్టే బౌండెడ్ స్క్రిప్ట్ గా సిద్ధం చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపిన హరీష్ శంకర్ మెగా బాస్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అని మెగా ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.