హరీష్ శంకర్ గట్స్ లెక్క ఇది..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా అంటే చాలు పక్కా పైసా వసూల్ బొమ్మ అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా అంటే చాలు పక్కా పైసా వసూల్ బొమ్మ అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. 2006 లో షాక్ తో డైరెక్టర్ గా పరిచయమైన హరీష్ శంకర్ దాదాపు 18 ఏళ్లలో కేవలం ఎనిమిది సినిమాలు మాత్రమే తీశాడు. కానీ తీసిన సినిమాలన్నీ కూడా తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేశాయి. హరీష్ శంకర్ అద్భుతమైన డైరెక్టర్ కానీ అతని మీద ఒక భారీ ఎలిగేషన్ ఉంది. అదే ఆయన రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తాడని. సొంతంగా కథలు రాయడ రాదా లేక మరో రీజనా అన్నది పక్కన పెడితే హరీష్ శంకర్ రీమేక్ లను చేయడం కొంతమందికి రుచించట్లేదు.
ప్రతిభ గల దర్శకుడే కదా ఎందుకు రీమేక్ లు ఎంచుకోవడం అన్నది వాళ్ల పాయింట్ అయితే ఒరిజినల్ కథ కన్నా రీమేక్ ని కొత్తగా తీయడం పెద్ద ఛాలెంజ్ అంటున్నాడు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాతో వస్తున్న హరీష్ శంకర్ ఈసారి రీమేక్ అన్న కామెంట్స్ కి ఘాటుగానే ఆన్సర్ ఇస్తున్నాడు. రవితేజ, భాగ్య శ్రీ జోడీగా నటిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తుంది.
ఐతే ఏ డైరెక్టర్ అయినా సరే తను తీసిన సినిమా రీమేక్ కాబట్టి ఒరిజినల్ మూవీ చూడొద్దని అంటాడు. కానీ హరీష్ శంకర్ మాత్రం మిస్టర్ బచ్చన్ చూసే ముందు రైడ్ సినిమా చూడాలని ఆడియన్స్ కోరాడు. ఆ సినిమా చూస్తే మిస్టర్ బచ్చన్ లో ఎలాంటి మార్పులు చేశామో తెలుస్తుందని అన్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా విషయంలో హరీష్ శంకర్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందో ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూస్తే అర్ధమవుతుంది.
మిస్టర్ బచ్చన్ చూసైనా సరే రైడ్ చూడండి.. రైడ్ చూసైనా సరే మిస్టర్ బచ్చన్ చూడండంటూ హరీష్ శంకర్ చెప్పడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. మిస్టర్ బచ్చన్ ప్రమోషనల్ కంటెంట్ మాస్ ఆడియన్స్ కి కిక్ ఇస్తుంది. ముఖ్యంగా భాగ్య శ్రీ బోర్స్ గ్లామర్ సినిమాలో సంథింగ్ స్పెషల్ గా ఉండేలా అనిపిస్తుంది. మరి మిస్టర్ బచ్చన్ రిలీజ్ ముందు హంగామా బాగున్నా రిలీజ్ తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.