హరీష్ మందు రాయాలని చూసినా...

ఆగస్టు 15న రావాల్సిన ‘పుష్ప-2’ చిత్రం వాయిదా పడడంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చాలా సినిమాలే చూస్తున్నాయి.

Update: 2024-07-29 11:01 GMT

ఆగస్టు 15న రావాల్సిన ‘పుష్ప-2’ చిత్రం వాయిదా పడడంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చాలా సినిమాలే చూస్తున్నాయి. వివిధ భాషల్లో క్రేజీ మూవీస్ ఆ డేట్‌కు రావడానికి సిద్ధపడుతున్ననాాయి. టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఇప్పటికే ఐదు చిత్రాలు బెర్తులు బుక్ చేసుకున్నాయి. అందులో ఒకటి తమిళ అనువాద చిత్రం ‘తంగలాన్’ కాగా.. మిగతా నాలుగు తెలుగు చిత్రాలైన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్, 35. వీటిలో ‘ఆయ్’, ‘35’ చిన్న సినిమాలు. వాటిని పరిమిత సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ప్రధానంగా క్లాష్ ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’ మధ్యే ఉండబోతోంది. ఐతే ‘డబుల్ ఇస్మార్ట్’ ఆడడం దర్శక నిర్మాత పూరి జగన్నాథ్‌కు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయం అర్థం చేసుకుని ‘మిస్టర్ బచ్చన్’ టీం క్లాష్‌కు రావాల్సింది కాదని.. పూరికి ఒకప్పుడు సన్నిహితులు, ఆయన ద్వారా ఎదిగిన రవితేజ, హరీష్ శంకర్ ఇలా చేయాల్సింది కాదనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.

‘డబుల్ ఇస్మార్ట్’ టీం కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉందనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఆ చిత్ర నిర్మాత ఛార్మి కౌర్.. సోషల్ మీడియాలో హరీష్, రవితేజలను అన్ ఫాలో చేయడం దీనికి సంకేతం. ఐతే ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ లాంచ్ సందర్భంగా హరీష్‌ను ఈ క్లాష్ గురించి అడిగితే.. పూరి తనకు ఇన్‌స్పిరేషన్ అని, అలాగే రామ్‌తో సినిమా చేస్తున్నానని చెప్పుకుంటూ.. అనివార్య పరిస్థితుల్లోనే తాము కూడా ఆగస్టు 15న వస్తున్నామని.. ఈ ఒక్క విషయానికి పూరితో తనకున్న రిలేషన్ పాడవదని.. ఆయన తనకంటే మెచ్యూర్ అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఐతే క్లాష్ విషయంలో డబుల్ ఇస్మార్ట్ టీం హర్టయిందన్నది వాస్తవం అని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. హరీష్ ఎంత మందు రాయాలని చూసినా.. ‘డబుల్ ఇస్మార్ట్’ టీం ఉన్న తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ‘మిస్టర్ బచ్చన్’ క్లాష్‌కు రావడం పట్ల అసంతృప్తి తగ్గదని.. తమ భవితవ్యం ఆధారపడ్డ సినిమాకు లేటుగా వచ్చి పోటీ పెట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News