ప్రేక్షకుల తీరుపై హీరోయిన్ అసహనం
అయితే ఈసారి ఈ ఫైర్ బ్రాండ్ ఏకంగా ప్రేక్షకుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడు కూడా బాలీవుడ్ మాఫియా అంటూ కొందరి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వారిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి ఈ ఫైర్ బ్రాండ్ ఏకంగా ప్రేక్షకుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది.
ప్రేక్షకులు తాను తీసే మహిళ సాధికారత ప్రోత్సాహక సినిమాలను ప్రోత్సహించకుండా హీరోయిన్స్ బూట్లు నాకే సన్నివేశాల సినిమాలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం మారాల్సిందే అన్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఒక వేళ ప్రేక్షకులు తమ యొక్క పద్ధతి ని మార్చుకోకుంటే భవిష్యత్తులో తాను కూడా తన సినిమాల మేకింగ్ విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవాల్సి ఉంటుందేమో అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో నా నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అంది.
సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రమే కాకుండా ప్రేక్షకులు మరియు మీడియా వర్గాల వారు కూడా హీరోయిన్స్ ను శృంగార వస్తువులుగా మాత్రమే చూస్తున్నారు అంటూ కంగనా ఆవేదన వ్యక్తం చేసింది. నటన తో మెప్పించిన తాను ఇప్పుడు ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పించలేక పోతున్నాను అంటూ ప్రేక్షకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.