500 కోట్ల క్లబ్‌లో టాప్- 5 హీరోయిన్స్
ఇక కథానాయికల్లో 500 కోట్ల క్లబ్ సినిమాల్లో నటించినది ఎందరు? అన్నది ఆరా తీస్తే తెలిసిన సంగతులివి. భారతీయ సినిమా చరిత్రలో సుమారు డజను మంది కథానాయికలు 500 కోట్ల క్లబ్ లో చేరడం ఆసక్తికరం.
వరుసగా బాక్సాఫీస్ వద్ద 500కోట్ల క్లబ్‌లు, 1000 కోట్ల క్లబ్ లు సాధ్యమవుతున్నాయి. బాహుబలి - బాహుబలి 2- దంగల్- ఆర్.ఆర్.ఆర్ -2.0- పద్మావత్- కేజీఎఫ్ 2- పఠాన్- జవాన్- జైలర్- గదర్ 2 చిత్రాలు 500కోట్ల క్లబ్ లు అందుకున్నాయి. వీటిలో మెజారిటీ సినిమాలు 1000 కోట్ల క్లబ్ లోను చేరాయి. ప్రభాస్, అమీర్ ఖాన్, యష్- షారూఖ్ ఖాన్- రామ్ చరణ్- ఎన్టీఆర్ లాంటి స్టార్లు 1000కోట్ల క్లబ్ హీరోలు అయ్యారు. 2.0, జైలర్ చిత్రాలతో రజనీకాంత్ 500కోట్ల క్లబ్ లో చేరారు.
ఇక కథానాయికల్లో 500 కోట్ల క్లబ్ సినిమాల్లో నటించినది ఎందరు? అన్నది ఆరా తీస్తే తెలిసిన సంగతులివి. భారతీయ సినిమా చరిత్రలో సుమారు డజను మంది కథానాయికలు 500 కోట్ల క్లబ్ లో చేరడం ఆసక్తికరం. అనుష్క, రమ్యకృష్ణ, దీపిక పదుకొనే, ఫాతిమా సనాషేక్, సన్య మల్హోత్రా, శ్రీనిధి శెట్టి, ఆలియా భట్, ఎమీజాక్సన్, నయనతార- అమీషా పటేల్.. ఇలా కొందరు కథానాయికలు 500 కోట్ల క్లబ్ సినిమాల్లో నటించారు. ఇందులో కొందరు 1000 కోట్ల క్లబ్ నాయికలు అయ్యారు.
బాహుబలి ఫ్రాంఛైజీతో అందాల కథానాయికలు అనుష్క శెట్టి, రమ్యకృష్ణ 500కోట్ల క్లబ్ లో చేరారు. తమ అందం నటనతో దశాబ్ధాల పాటు ఏలిన ఈ భామలు రికార్డ్ బ్రేకింగ్ చిత్రాలతో చరిత్రలో నిలిచారు. బాహుబలి 2 చిత్రం 1000 కోట్లు పైగా వసూలు చేయడంతో ఆ ఇద్దరు కథానాయికలను 1000 కోట్ల క్లబ్ నాయికలుగా పిలవొచ్చు.
దంగల్ సినిమాతో ఫాతిమా సనాషేక్, సన్య మల్హోత్రా 500 కోట్ల క్లబ్, 1000 కోట్ల క్లబ్ నటీమణులు అయ్యారు. అమీర్ నటించిన ఈ సినిమా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో ఫాతిమా, సన్య అథ్లెట్లుగా నటించారు. వారి నటనకు గొప్ప పేరొచ్చింది. ఆ తర్వాత కథానాయికలుగా బాలీవుడ్ లో ఆ ఇద్దరూ ఎదిగారు.
కేజీఎఫ్ 2లో కథానాయికగా నటించిన శ్రీనిధి శెట్టి కెరీర్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా తను కూడా 500 కోట్ల క్లబ్ నాయిక. కేజీఎఫ్ 2 చిత్రం 1000 కోట్ల క్లబ్ లోను చేరింది. ఆర్.ఆర్.ఆర్ లో నటించిన ఆలియాభట్ 1000 కోట్ల క్లబ్ నాయిక. ఆలియా భారతదేశంలోనే అగ్ర కథానాయికగా రాణిస్తోంది. 2.0 చిత్రంలో నటించిన ఎమీజాక్సన్ 500 కోట్ల క్లబ్ నాయిక. రజనీకాంత్ కెరీర్ లో కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ చిత్రం అద్భుత వసూళ్లను సాధించినా చాలా చోట్ల పంపిణీదారులకు నష్టాలొచ్చాయి. ఈ చిత్రంలో నటించిన రజనీకాంత్, ఎమీజాక్సన్, అక్షయ్ కుమార్ లకు గొప్ప పేరొచ్చింది.
పఠాన్ - జవాన్ చిత్రాలతో దీపిక పదుకొనే 500 కోట్ల క్లబ్ తో పాటు, 1000 కోట్ల క్లబ్ లో చేరింది. జవాన్ చిత్రంతో అందాల నయనతార 1000 కోట్ల క్లబ్ అందుకుంది. నయనతార సౌతిండియా సూపర్ స్టార్ గా ఏల్తోంది. ఇప్పుడు ఉత్తరాదినా నయన్ సంచలనాలు మొదలయ్యాయి. ఇక 500 కోట్ల క్లబ్ లో చేరిన జైలర్ చిత్రంలో స్పెషల్ నంబర్ లో కనిపించిన తమన్నా బాహుబలి ఫ్రాంఛైజీలోను నటించడం ఆసక్తికరం. సన్నీడియోల్ నటించిన గదర్ 2 చిత్రం 500 కోట్లు పైగా వసూలు చేసింది. ఇందులో నటించిన అమీషా పటేల్ కి పేరొచ్చింది. అమీషా ఇప్పుడు 500 కోట్ల క్లబ్ నాయిక. దాదాపు డజను మంది కథానాయికల పేర్లు ఇప్పటికే 500 కోట్ల క్లబ్ లో చేరాయి.