అక్కడ వీళ్లని తట్టుకోలేకపోతున్నారా..?

వరుస అవకాశాలు వస్తుండటం వల్ల చేసేది మన భాష లేదా వేరే భాష అనేది చూడరు.

Update: 2024-06-20 10:30 GMT

ముంబై భామల సంగతి ఏమో కానీ మలయాళం, కన్నడ పరిశ్రమల నుంచి వచ్చిన హీరోయిన్స్ సౌత్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకోగానే వారి సొంత భాషా సినిమాల కన్నీ మిగతా భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ఏ హీరోయిన్ అయినా సరే కన్నడ లేదా మలయాళ పరిశ్రమ నుంచి తెలుగులో ఛాన్సులు అందుకుంది అంటే.. ఆ హీరోయిన్ మళ్లీ తిరిగి వెళ్లి కన్నడ, మలయాళ సినిమాలు చేసే పరిస్థితి కనబడలేదు. అలా ఎందుకు అంటే తెలుగు, తమిళ సినిమాల్లో నటించడం వల్ల వారికి నేషనల్ లెవెల్ లో ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. దాని ద్వారా క్రేజీ ఛాన్సులు అందుకుంటారు.

వరుస అవకాశాలు వస్తుండటం వల్ల చేసేది మన భాష లేదా వేరే భాష అనేది చూడరు. అంతేకాదు మలయాళం, కన్నడ పరిశ్రమల నుంచి వచ్చి తెలుగు, తమిళ భాషల్లో స్టార్ డం తెచ్చుకున్న భామలు మళ్లీ సొంత భాషలో సినిమాలు చేయాలని అనుకున్నా వీరికి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను బట్టి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ అంత ఇచ్చుకునే పరిస్థితి ఉండదనే కారణం వల్ల కూడా వారిని లైట్ తీసుకుంటారని తెలుస్తుంది.

కన్నడ నుంచి వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న ఇప్పుడు చేసే పాన్ ఇండియా సినిమాలే చేస్తుంది కానీ కన్నడ సినిమాలు మాత్రం అంతగా పట్టించుకోవట్లేదు. మలయాళం నుంచి వచ్చిన సాయి పల్లవి, కీర్తి సురేష్ కూడా డిమాండ్ ఉన్న చోటే సినిమాలు చేస్తున్నారు. వీరిద్దరు కూడా కేవలం మలయాళంలో నటించి చాలా రోజులు అవుతుంది. ఇలా ఎవరికి వారు కన్నడ, మలయాళ సినిమాలతో పాపులర్ అవ్వడం అలా సౌత్ ఇండస్ట్రీలో వరుస ఛాన్సులతో సత్తా చాటడం జరుగుతుంది.

తెలుగు, తమిళ భాషల్లో హీరోలకు సమానంగా అని చెప్పలేం కానీ 2, 3 కోట్ల దాకా హీరోయిన్స్ కి రెమ్యునరేషన్ ఇస్తుంటారు. కానీ మలయాళ, కన్నడ పరిశ్రమ లో హీరోయిన్స్ కి అంత పారితోషికం ఇవ్వరు. అందుకే స్టార్ హీరోయిన్స్ కన్నా అక్కడ అప్ కమింగ్ హీరోయిన్స్ కి మంచి అవకాశాలు ఇస్తుంటారు. స్టార్ హీరోయిన్స్ ని తట్టుకోవడం కష్టమనే ఆ పరిశ్రమలు వారికి ఛాన్సులు ఇవ్వరని చెప్పుకుంటారు. ఈ కారణాల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కానీ ఈ టాలెంటెడ్ హీరోయిన్స్ ఆ ఇండస్ట్రీల నుంచి వచ్చిన వారే అని చెప్పుకోవడం మాత్రం జరుగుతుంది.

Tags:    

Similar News