బన్నీ -తారక్ - చరణ్.. 2000 కోట్లు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత టాలీవుడ్ లో అత్యధిక మార్కెట్ ఉన్న పాన్ ఇండియా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, తారక్. ఆర్ఆర్ఆర్ తో చరణ్ తారక్ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అందుకొని గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నుంచి రాబోయే సినిమాలకి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది.
నెక్స్ట్ రాబోయే సినిమాల ద్వారా ఒక్కొక్కరికి 300-400 కోట్ల వరకు మార్కెట్ ఉందని చెప్పవచ్చు. వీరి నుంచి వస్తోన్న సినిమాల బడ్జెట్ కూడా 200 నుంచి 300 కోట్ల వరకు ఉన్నాయి. ఈ ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ లో ముందుగా దేవర సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే 350 కోట్లకి పైగా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న దేవర మూవీ కచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
హిట్ టాక్ వస్తే 600 కోట్ల వరకు దేవర సినిమా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి పుష్ప 2 రిలీజ్ కానుంది. డిసెంబర్ 6న ఈ చిత్రం గ్లోబల్ వైజ్ గా ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాపై 400+కోట్లకి పైగా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఒక్క తెలుగులోనే 200 కోట్ల వ్యాపారం పుష్ప 2పైన జరగడం విశేషం. పుష్ప సినిమా సక్సెస్ తో పుష్ప 2పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ మూవీ 800-1000 కోట్ల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. క్రిస్మస్ ఫెస్టివల్ కి ఈ చిత్రం రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి 300 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు పెద్దగా బజ్ అయితే లేదు. కాని దిల్ రాజు స్ట్రాటజీ ప్రకారం ఏదైనా మ్యాజిక్ జరిగితే ఈ సినిమా కూడా 400 లేదా 500 కోట్ల మధ్యలో కలెక్షన్స్ ని సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితుల మాట.
ఈ విధంగా చూసుకుంటే 2024లో ఈ ముగ్గురు స్టార్స్ నుంచి 2000 కోట్ల వరకు బిజినెస్ అయితే జరగాలి. కానీ బజ్ పరంగా మూడు సినిమాలు ఇంకా క్రేజ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కల్కితో ప్రభాస్ టాలీవుడ్ బాక్సాఫీస్ కి 1000 కోట్లు కలెక్షన్స్ ఇచ్చాడు. మిగిలిన ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ నుంచి 2000 కోట్ల కలెక్షన్స్ ఈ ఏడాది వస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్కెట్ పరంగా టాలీవుడ్ మరోసారి నెంబర్ వన్ లో నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.