తెలంగాణ సినిమాని అభివృద్ధి చేయడం అంటే ఏంటి?
అలాగే పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహా హైదరాబాద్ ఫిలింఇనిస్టిట్యూట్ ని కూడా నెలకొల్పాలని తెరాస పెద్దలు అప్పట్లో అన్నారు... కానీ ఏదీ? ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నమే కనిపించలేదు.
ఏపీ-తెలంగాణ విడిపోయే క్రమంలో ఒక కొత్త డిమాండ్ తెరపైకొచ్చింది. తెలుగు సినిమాల సెట్స్‌పై ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం మాటున అల్లరి మూకలు దాడులు చేస్తున్న క్రమంలో తెలంగాణ ట్యాలెంట్ కి అవకాశాలు కల్పించాలనేది ఒక ప్రధాన డిమాండ్. తెలుగు సినిమాల్లో 50శాతం తెలంగాణ కళాకారులకు అవకాశాలివ్వాలని కూడా డిమాండ్ చేసారు. కానీ అది ఇప్పటికీ ఓ కలగానే మిగిలిపోయింది. తెలంగాణ డివైడ్ తర్వాత తెరాస ప్రభుత్వం తెలంగాణ కళాకారులకు అవకాశాలు మెరుగయ్యేందుకు సరైన ప్రయత్నాలు చేస్తుందని భావించారు. కానీ తెరాస ప్రభుత్వం టాలీవుడ్ ని, ఏపీకి చెందిన బడా ఫిలింమేకర్స్ ని ఎటూ వెళ్లిపోకుండా పట్టుకోవడంలో నిమగ్నమై, తెలంగాణ కళాకారులను, ట్యాలెంట్ ను అస్సలు పట్టించుకోలేదు. లోకల్ నినాదం పూర్తిగా తెరమరుగైంది.
అయితే ప్రభుత్వాలు మారుతున్నా తెలంగాణ కళాకారుల తలరాతలు మారలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సినీపరిశ్రమకు అనుకూలంగానే ఉన్నారు. కానీ ఇప్పటికీ తెలంగాణ ట్యాలెంట్ కి సరైన అవకాశాల్లేవ్. నిజానికి కళారంగంలో ప్రతిభ ఒక్కటే కొలమానం. తెలంగాణ, ఆంధ్రా అని విడదీయలేం. కానీ తెలంగాణ నుంచి వచ్చే పేద మధ్య తరగతి కళాకారులకు ప్రత్యేకంగా సపోర్టింగ్ వ్యవస్థ అవసరమని కూడా విశ్లేషించారు సినీపెద్దలు. కానీ దాని గురించి ప్రాక్టికల్ గా ఎవరూ ఏదీ చేయలేదు. సహకారం అన్నదే లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్ ట్యాలెంట్ కోసం ప్రభుత్వం ఏదైనా చేయాలి.. స్థానిక నాయకులు, పారిశ్రామిక వేత్తలు, తెలంగాణ పెద్దలు సినిమాలు తీయాలి.. ట్యాలెంట్ హబ్ లు ఏర్పాటు చేయాలి. తెలంగాణ ట్యాలెంట్ కి ప్రాధాన్యతనిస్తూనే, పొరుగు ప్రతిభను కూడా ప్రోత్సహించాలి.. అప్పుడే స్థానిక ప్రతిభకు అవకాశాలొస్తాయి. కొంతవరకూ ప్రాంతీయ భేధంతో సంబంధం లేకుండా ఆంధ్రాకు చెందిన ఫిలింమేకర్స్ తెలంగాణ ప్రతిభకు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నారన్ని మరువరాదు.
అలాగే పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహా హైదరాబాద్ ఫిలింఇనిస్టిట్యూట్ ని కూడా నెలకొల్పాలని తెరాస పెద్దలు అప్పట్లో అన్నారు... కానీ ఏదీ? ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నమే కనిపించలేదు. ఒకవేళ హైదరాబాద్ కు పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహాలో ఏదైనా అధికారిక శిక్షణా సంస్థ వస్తే అక్కడ ఇరు తెలుగు రాష్ట్రాల ఔత్సాహిక కళాకారులు, సాంకేతిక నిపుణులు తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పటికీ ఇది కలగానే మిగిలిపోయిందనే ఆవేదన ఇండస్ట్రీలో ఉంది. ఫిలింఇనిస్టిట్యూట్ ఏర్పాటు కోసం తెరాస ఏమీ చేయలేదు..
కాంగ్రెస్ కూడా పట్టించుకోవడం లేదు!! అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదుగుతున్నా, హాలీవుడ్ కి ధీటుగా సాంకేతిక విలువల్ని ప్రదర్శిస్తున్నా కానీ, పాలకుల నుంచి సరైన సహకారం లేకపోవడం నిరాశపరుస్తోంది.