నా ప్రతి పనిలో అతడి సపోర్ట్‌ ఉంటుంది : రష్మిక

ప్రస్తుతానికి సౌత్‌ లో వరుసగా పెద్ద సినిమాల్లో చేస్తున్న రష్మిక ముందు ముందు భారీ చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.

Update: 2024-02-01 15:30 GMT

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా దూసుకు పోతుంది. యానిమల్‌ సినిమా తర్వాత బాలీవుడ్‌ లో కూడా రష్మిక వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి సౌత్‌ లో వరుసగా పెద్ద సినిమాల్లో చేస్తున్న రష్మిక ముందు ముందు భారీ చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.

తాజాగా ఒక బాలీవుడ్‌ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ తనకు విజయ్‌ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యం మరియు స్నేహం గురించి చెప్పుకొచ్చింది. గతంలో పలు సార్లు వీరిద్దరి ప్రేమ మరియు పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున వచ్చిన విషయం తెల్సిందే. మరోసారి తామిద్దరం మంచి స్నేహితులం అంది.

ఇంకా రష్మిక మాట్లాడుతూ... విజయ్‌ నేను కెరీర్‌ లో కలిసి ఎదుగుతున్నాం. నేను చేసే ప్రతి పనిలో కూడా విజయ్‌ సపోర్ట్‌ ఉంటుంది. నేను చేసే ప్రతి పనికి విజయ్ సలహాలు తీసుకుంటూ ఉంటాను. ఏది మంచి ఏది చెడు అనే విషయాల్లో విజయ్‌ కి క్లారిటీ ఉంటుంది. అందుకే నాకు ప్రతి విషయంలో కూడా విజయ్ సపోర్ట్‌ ఉంటుంది.

నా వ్యక్తిగత జీవితంలో కూడా విజయ్‌ సపోర్ట్‌ చాలా ఎక్కువ. అందరి కంటే కూడా ఎక్కువగా నా నిర్ణయాలను సమర్థిస్తూ, నాకు మద్దతుగా విజయ్ నిలుస్తాడు. అందుకే నాకు విజయ్ అంటే గౌరవం, విజయ్ తో తాను చాలా ఫ్రీగా ఉండగలుగుతాను అంది.

ఒక వైపు ఇద్దరం మంచి స్నేహితులం అంటూనే మరో వైపు విజయ్‌ అంటే నాకు చాలా స్పెషల్ అంటూ చెప్పడం ద్వారా అర్థం ఏంటి అంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో మరోసారి రష్మిక మందన్న యొక్క వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.


Tags:    

Similar News