ఇలియానా పుట్టబోయే బిడ్డకు తండ్రి ఇతడే.. సస్పెన్స్ క్లియర్​

సోషల్​మీడియా అంతటా తెగ ట్రెండింగ్

Update: 2023-07-17 09:27 GMT

గత కొంతకాలంగా తన బాయ్​ఫ్రెండ్​ ఎవరో చెప్పకుండా సస్పెన్స్​లో పెట్టిన సీనియర్ హీరోయిన్‌ ఇలియానా ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టింది. తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్​మీడియా అంతటా తెగ ట్రెండింగ్ అవుతోంది.

ఇలియానా గత కొన్ని నెలల క్రితం ఏప్రిల్​లో తను తల్లి కాబోతున్నట్లు పోస్ట్​ అందర్నీ షాక్​కు గురి చేసింది. 'తల్లిగా మారడం ఓ గొప్ప అనుభూతి. నాలో మరో జీవి ప్రాణం పోసుకుంటుంది అనే అనుభూతి ఎంతో ఆనందంగా ఉంది' అని చెప్పి సర్​ప్రైజ్ చేసింది. దీంతో అందరు ఆమె బాయ్ ఫ్రెండ్​ ఎవరు, పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో అని విసృతంగా చర్చించారు. కానీ ఎవరనేది తెలుసుకోలేకపోయారు. కానీ ఇలియానా అతడి ముఖాన్ని దాచిపెడుతూ తన బేబీ బంప్ ఫొటోలను తెగ షేర్ చేసింది.

అయితే ఈ క్రమంలోనే చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎవరనేది కనిపెట్టడం అందరికీ అసాధ్యం అయిపోయింది. అయినా ఆ మిస్టరీ మ్యాన్‌‌ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం అందరిలో తెగ పెరిగిపోయింది. తాజాగా ఈ దాగుడుమూతలకు ఇలియానా తెరదించింది. తాను ఎవరితో రిలేషన్‌లో ఉందో చెప్పింది.

తాజాగా 'డేట్‌ నైట్‌' అనే క్యాప్షన్‌తో తన లవర్​ ఫొటోలను తొలి సారి సోషల్​మీడియా వేదికగా షేర్‌ చేసింది. కానీ అతడి పేరు, వివరాలను తెలపలేదు. అలా మళ్లీ ఓ సస్పెన్స్​ పెట్టింది. దీంతో నెటిజన్లు మళ్లీ సస్పెన్స్​ పెట్టావా? అతడి వివరాలు చెప్పాలంటూ తెగ కామెంట్స్‌ పెడుతున్నారు.

రీసెంట్​గా ఇలియానా బేబీమూన్‌కు కూడా వెళ్లొచ్చింది. ఆ సమయంలో ఇన్‌స్టాలో ప్రియుడిని ఉద్దేశించి ఓ పోస్ట్ కూడా పెట్టింది. తాను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతడు ఎంతో ధైర్యాన్నిచ్చాడని చెప్పుకొచ్చింది.

ఎన్నో సందర్భాల్లో తనకు అండగా, మద్దతుగా నిలిచాడని చెప్పింది. తన కన్నీళ్లు తుడిచి నవ్వులు పూయించాడంటూ ప్రియుడిపై ప్రశంసల వర్షం కురిపించింది. తనకు ఎప్పుడు ఏం కావాలో అతడు అర్థం చేసుకున్నాడని వెల్లడించింది. అతడు పక్కన ఉంటే తనకు ఏదీ కష్టంగా అనిపించదని తెలిపింది.

Tags:    

Similar News