స్లీప్ లెస్ కామెంట్స్.. నాగవంశీపై మళ్లీ ట్రోల్స్..
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఆ మధ్య జరిగిన ఇయర్ ఎండింగ్ రౌండ్ టేబుల్ డిస్కషన్ లో పాల్గొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఆ మధ్య జరిగిన ఇయర్ ఎండింగ్ రౌండ్ టేబుల్ డిస్కషన్ లో పాల్గొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ.. బీటౌన్ లో సింగిల్ డేలో రూ.80 కోట్ల వసూలు చేయడంతో బాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులకు ఆ రాత్రి నిద్ర పట్టలేదని వ్యాఖ్యానించారు నాగవంశీ. దీంతో అప్పుడు పెద్ద చర్చ నడిచింది.
బాలీవుడ్ కు చెందిన సిద్దార్థ్ ఆనంద్, సంజయ్ గుప్తా, హన్సల్ మెహతా వంటి పలువురు ప్రముఖులు నాగవంశీ కామెంట్స్ పై మండిపడ్డారు. ఆయన కామెంట్స్ ను తప్పుపట్టారు. బీటౌన్ ఎగ్జిబిటర్ల వల్లే ఆ సినిమా రూ.86 కోట్లు కలెక్ట్ చేసిందని తెలిసి తాము చాలా ప్రశాంతంగా నిద్రపోయామని తెలిపారు. ఎదుటివాళ్ల విజయం తమకు నిద్రలేని రాత్రులు ఇవ్వదని తెలిపారు.
అప్పుడు నాగవంశీపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ కనిపించగా.. ఇప్పుడు మరోసారి దర్శనమిస్తున్నాయి. బాలయ్య హీరోగా ఆయన నిర్మించిన డాకు మహారాజ్ మూవీ.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఆ సినిమా.. హిట్ టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది.
అయితే రీసెంట్ గా నార్త్ ఇండియాలో డాకు మహారాజ్ మూవీ హిందీ వెర్షన్ ను విడుదల చేశారు మేకర్స్. నార్మల్ గా మాస్ మూవీస్ ను అంతగా ఆదరించని ఉత్తరాది సినీ ప్రియులు.. డాకు మహరాజ్ కు మాత్రం అట్రాక్ట్ అయ్యారని నెట్టింట రివ్యూస్ వచ్చాయి. బాలయ్య నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్ కు ఫిదా అయ్యారని టాక్ వినిపించింది.
ఇక నాలుగు రోజుల్లో హిందీలో డాకు మహరాజ్ రూ.20 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో అప్పుడు నాగవంశీ పుష్ప-2 విషయంలో చేసిన కామెంట్స్ కు కొందరు బాలీవుడ్ నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. బీటౌన్ లో డాకు మహారాజ్ రాబట్టిన వసూళ్లు చూస్తే నిజంగానే ఆయనకు నిద్ర పట్టదని ఎద్దేవా చేస్తున్నారు. స్లీప్ లెస్ కామెంట్స్ ను ట్రోల్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగవంశీపై వస్తున్న ట్రోల్స్ ను కొందరు తిప్పి కొడుతున్నారు. మళ్లీ అనవసరంగా వివాదాన్ని రేపుతున్నారని.. ఇది మంచి పరిణామం కాదని అభిప్రాయపడుతున్నారు. మరి నాగవంశీ తనపై వస్తున్న ట్రోల్స్ పై ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.