ఫోటో స్టోరి: అరెరే క‌న్ను గీట‌క‌లా కొంటె పిల్లా

బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్ తో పాల‌క్ సాన్నిహిత్యం నిరంత‌రం చ‌ర్చ‌గా మారుతోంది.

Update: 2025-01-29 18:06 GMT
ఫోటో స్టోరి: అరెరే క‌న్ను గీట‌క‌లా కొంటె పిల్లా
  • whatsapp icon

బాలీవుడ్ లో న‌ట‌వార‌సుల హ‌వా కొన‌సాగుతోంది. న‌టి శ్వేతా తివారీ వార‌సురాలు పాల‌క్ తివారీ ఇంత‌కుముందే తన మొద‌టి సినిమాతో అల‌రించి వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తోంది. ఇటీవ‌ల ఈ భామ ల‌వ్ లైఫ్ గురించి ఎక్కువ‌గా మీడియా హెడ్ లైన్స్ లో కొస్తోంది. బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్ తో పాల‌క్ సాన్నిహిత్యం నిరంత‌రం చ‌ర్చ‌గా మారుతోంది. యువ‌జంట స్నేహం షికార్ల గురించి మీడియా క‌థ‌నాలు అల్లుతోంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏం జ‌రుగుతోందో ఎవ‌రికీ ఇంకా క్లారిటీ లేదు.


ఇదిలా ఉంటే, పాల‌క్ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ హాట్ టాపిగ్గా మారుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ కొంటె ఫోటోగ్రాఫ్ కుర్ర‌కారు గుండెల్ని పిండేస్తోంది. ఇదిగో ఇలా నాజూకు న‌డుము అందాల‌ను, నాభి సొగ‌సును ప్ర‌ద‌ర్శిస్తూ పాల‌క్ కొంటెగా క‌న్ను గీటుతోంది. బాట‌మ్ లో ట్రాక్ సూట్.. ముడి వేసిన వైట్ ష‌ర్ట్ కి చేతులు మ‌డ‌త‌పెట్టి పూర్తిగా రెబ‌ల్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. పాల‌క్ అందచందాలు క‌వ్వించే కొంటెత‌నం గురించి యూత్ ఎక్కువ‌గా ముచ్చ‌టిస్తోంది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పాలక్ తివారీ 2021లో వెబ్ సిరీస్ రోజీ: ది సాఫ్రాన్ చాప్టర్ ద్వారా తన నటనా రంగ ప్రవేశం చేసింది. 2023లో సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ యాక్షన్ కామెడీలో పూజా హెగ్డే కూడా కీలక పాత్రలో నటించింది. ఇటీవ‌ల ఇబ్ర‌హీం అలీఖాన్ స‌ర‌స‌నా ఈ బ్యూటీ అవ‌కాశం అందుకుందని స‌మాచారం. ఈ అవ‌కాశం రాక ముందు నుంచే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం ఉంది.

Tags:    

Similar News