బాలీవుడ్‌కు ఊపిరి పోసిన ఛత్రపతి 'చావా'

ఇప్పటివరకు రికార్డు స్థాయిలో తొలి వీకెండ్‌లోనే 100 కోట్లు సాధించిన చావా, రెండో వారాంతానికి 150 కోట్లు పూర్తి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Update: 2025-02-17 12:53 GMT

ఇటీవల బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అంతగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. అయితే చావా చిత్రం ఈ నెగటివ్ ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ, బాలీవుడ్‌కి బిగ్ రిలీఫ్ అందించింది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హిస్టారికల్‌ మూవీ, మహారాష్ట్రలో మొదటి నుండి మాస్‌ క్యారీలో నిలుస్తుందని అంచనాలు ఉన్నప్పటికీ, వాస్తవంలో కూడా అదే జరుగుతూ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ను తీసుకొచ్చింది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంబాజి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక ఫీమేల్ లీడ్ లో నటించింది. ఛత్రపతి సెంటిమెంట్ బాగా కలిసి రావడంతో సినిమా కలెక్షన్స్ ఊపందుకున్నాయి. ఇక శనివారం, ఆదివారం కలెక్షన్లు భారీగా పెరగడంతో వారం చివరిలో ఈ చిత్రం 106 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఆదివారం ఒక్కరోజే 44 కోట్లు రాబట్టి, ఈ సినిమా హిట్ రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఈమధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలకు ఇలాంటి ఓపెనింగ్ రాలేదు. ఫిల్మ్ ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ మూవీ గురించి హైప్‌ పెరిగింది. కానీ, గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సినిమా వసూళ్లలో మెజారిటీ మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి. ప్రత్యేకించి ముంబయి అర్బన్ బెల్ట్‌లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కు సంబంధించిన ఇతిహాసిక కథాంశంతో రూపొందడంతో, ఈ ప్రాంతంలోని ప్రజలు సినిమాను ఓ ప్రత్యేకమైన భావోద్వేగంతో చూస్తున్నారు.

ఉత్తర భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పరవాలేదు అనేలా ఓపెనింగ్స్‌ సాధించినప్పటికీ, మహారాష్ట్ర రేంజ్‌లో అట్రాక్షన్ మాత్రం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ, పాజిటివ్ టాక్ కారణంగా మొత్తం మీద సినిమా స్టడీగా నడుస్తోంది. విశేషంగా, హైదరాబాదులో కూడా ఈ సినిమాకు మల్టీప్లెక్స్‌ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

ఇప్పటివరకు రికార్డు స్థాయిలో తొలి వీకెండ్‌లోనే 100 కోట్లు సాధించిన చావా, రెండో వారాంతానికి 150 కోట్లు పూర్తి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంగళవారం, బుధవారం కలెక్షన్లు ఎలా ఉంటాయన్నదే, సినిమా ఫైనల్ రన్‌ను నిర్ణయించనుంది. కానీ సోమవారం బుకింగ్స్ బాగా ఉన్నట్లు సమాచారం కావడంతో, సినిమా బాక్సాఫీస్‌పై మరింతగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి బాలీవుడ్‌కు మరోసారి మాస్ అట్రాక్షన్ కలిగిన హిస్టారికల్ మూవీ బాక్సాఫీస్‌ వద్ద హవా చూపిస్తుందనే చెప్పాలి. ఇప్పటికే విజయవంతంగా మొదటి అడుగు వేసిన చావా, లాంగ్ రన్‌లో ఎలా నడుస్తుందో చూడాలి.

Tags:    

Similar News