త‌ర్వాతి సినిమాకు రెడీ అవుతున్న చైతూ

ప్ర‌స్తుతం తండేల్ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాగ చైత‌న్య త్వ‌ర‌లోనే త‌న నెక్ట్స్ సినిమాను మొద‌లుపెట్ట‌నున్నాడు.

Update: 2025-02-20 06:08 GMT

గ‌త కొన్ని సినిమాలుగా స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య తండేల్ సినిమాతో త‌న స‌క్సెస్ ఆక‌లిని తీర్చుకున్నాడు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.110 కోట్ల గ్రాస్ ను దాటేసి, నాగ చైత‌న్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ప్ర‌స్తుతం తండేల్ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాగ చైత‌న్య త్వ‌ర‌లోనే త‌న నెక్ట్స్ సినిమాను మొద‌లుపెట్ట‌నున్నాడు. చైత‌న్య త‌న త‌ర్వాతి సినిమాను విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. కార్తీక్ ద‌ర్శ‌కత్వంలో నాగ చైత‌న్య చేయ‌బోతున్న ఈ సినిమా త‌న కెరీర్లో 24వ మూవీగా తెర‌కెక్కుతుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం NC24 ప్రీ ప్రొడ‌క్ష‌న్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెలాఖ‌రు నుంచి సినిమా ప‌ట్టాలెక్క‌బోతున్న‌ట్టు స‌మాచారం. తండేల్ సినిమాతో ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న చైత‌న్య‌కు ఈ సినిమాతో ఆ క్రేజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయమ‌నిపిస్తుంది. కాగా NC24 మిస్టిక్ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో రూపొంద‌నుంది.

కార్తీక్ దండు ఈ సినిమాలో ఓ కొత్త ప్ర‌పంచాన్ని చూపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దాని కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ నాగేంద్ర ఇప్ప‌టికే స్పెష‌ల్ సెట్స్ ను కూడా నిర్మిస్తున్నాడ‌ట‌. మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర మ‌రియు సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. ఈ సినిమాకు అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే కార్తీక్ దండు ఈ ప్రాజెక్ట్ కోసం బెస్ట్ టెక్నిక‌ల్ టీమ్ ను ఎంపిక చేసుకుని వ‌ర్క్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సీజీ వ‌ర్క్ భారీ స్థాయిలో ఉండ‌టం వ‌ల్ల ఆడియ‌న్స్ కు గొప్ప విజువ‌ల్స్ ను అందించి, మెస్మ‌రైజ్ చేయాల‌ని చూస్తున్నాడు. ఈ సినిమాకు వృష క‌ర్మ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News