త్రివిక్రమ్ కొత్త మూవీ సంగతేంటి?
ఇప్పటి వరకు 22 ఏళ్ల కెరీర్ లో 12 సినిమాలు తీసుకొచ్చిన త్రివిక్రమ్.. చివరగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీని తెరకెక్కించారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆయన రాసే డైలాగ్స్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా తెలుగు సినీ ప్రియుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
ఇప్పటి వరకు 22 ఏళ్ల కెరీర్ లో 12 సినిమాలు తీసుకొచ్చిన త్రివిక్రమ్.. చివరగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ.. త్రివిక్రమ్ రచనపై విమర్శలు వచ్చారు. నెగిటివిటీ ఏర్పడింది. కానీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం ఇప్పుడు అంతా వెయిట్ చేస్తున్నారు.
గుంటూరు కారం మూవీ వచ్చి ఏడాది దాటిపోతున్నా ఇంకా త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో అనేది క్లారిటీ రాలేదు. ఆ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నారని నిర్మాత నాగవంశీ పలుమార్లు తెలిపారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తీస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
అదే సమయంలో అల్లు అర్జున్.. అట్లీతో వర్క్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టు మొదలు కానుందని తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్ కాలేదన్నమాట. అదే సమయంలో త్రివిక్రమ్.. సినిమాలకు దూరమవుతున్నారా.. పవన్ రాజకీయ ప్రయాణంలో బిజీ అవుతున్నారా... అంటే కొందరు అవుననే సమాధానమిస్తున్నారు.
త్రివిక్రమ్, పవన్ చాలా సన్నిహితంగా ఉంటారన్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ రాజకీయ ప్రయాణంలో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కు సంబంధించిన రాజకీయ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. కొన్ని సార్లు బహిరంగంగా కనిపించకపోయినా.. త్రివిక్రమ్ వారంలో 3-4 రోజులు హైదరాబాద్ లో కాకుండా అమరావతిలో గడుపుతున్నారట.
అలా ప్రస్తుతం పవన్ పొలిటికల్ జర్నీలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా పవన్ ఫ్యామిలీతో కలిసి కుంభమేళాకు కూడా వెళ్లారు. అయితే సినిమాలకు మాత్రం ఆయన దూరమవుతున్నారని చెప్పలేం. ఎందుకంటే పలు భారీ ప్రాజెక్టులకు ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ తో కాస్త లేట్ అయినా.. ఆ సినిమా తెరకెక్కడం ఖాయమనే చెప్పాలి. దీంతో త్రివిక్రమ్.. బిజీగా ఉన్నా.. సినిమాలకు ఇప్పుడే దూరమవుతారని చెప్పలేం.