2025 లో మిల్కీ బ్యూటీ మెరుపులు క‌ష్ట‌మేనా!

మూడేళ్ల‌గా త‌మ‌న్నా ఇదే రూట్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. దీంతో మినిమం బిజీతోనె కెరీర్ సాగింది.

Update: 2025-02-20 06:39 GMT

హీరోయిన్ గా అవ‌కాశాలు త‌గ్గుతున్నాయి అనుకుంటోన్న స‌మ‌యంలో? మిల్కీబ్యూటీ త‌మ‌న్నా మ‌రో ఆలోచ‌న లేకుండా తెలివిగా ఐటం గాళ్ గా ట‌ర్న్ అయింది. ఏదైనా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వ‌చ్చినా? గెస్ట్ రోల్ ఆప‌ర్ వ‌చ్చినా చేయ‌డం. వాటితో పాటు ఐటం ఆఫ‌ర్ల వ‌చ్చినా కాద‌న‌కుండా ఎస్ చెప్పి ముందు కెళ్ల‌డం విష‌యంలో త‌మ‌న్నా మంచి స‌క్సెస్ అయింది. త‌న‌కున్న బ్రాండ్ ఇమేజ్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంది.

మూడేళ్ల‌గా త‌మ‌న్నా ఇదే రూట్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. దీంతో మినిమం బిజీతోనె కెరీర్ సాగింది. గ‌త రెండేళ్ల కాలంగా ఎనిమిది సినిమాల‌కు పైగా ప‌నిచేసిందంటే? ఆ ర‌క‌మైన స్ట్రాట‌జీ ఉండ టంతో ప‌నైంది అన్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. గ‌త ఏడాదే నాలుగు సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. అయితే ఈ ఏడాది మాత్రం అంత‌టి జోష్ తో క‌నిపిస్తుందా? లేదా? అన్న‌ది చెప్ప‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే త‌మ‌న్నా ఖాతాలో సినిమాలేవి క‌నిపించ‌లేదు.

ప్ర‌స్తుతం తెలుగులో త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో `ఓదెల‌2` లో న‌టిస్తోంది. చేతిలో ఈ ఒక్క సినిమా మిన‌హా మ‌రో కొత్త ఛాన్స్ లేదు. తెలుగులో గానీ, త‌మిళ్ లో గానీ కొత్త సినిమాల‌కు వేటికి సైన్ చేయ‌లేదు. `డార్లింగ్స్ పార్ట‌న‌ర్స్` వెబ్ సిరీస్ మాత్రం బాలీవుడ్ లో చేస్తోంది. అంత‌కు మించి మిల్కీబ్యూటీ క‌మిట్ మెంట్లు ఏవీ క‌నిపించ‌లేదు. దీంతో త‌మ‌న్నా కూడా `ఓదెల‌2`పైనే ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. సినిమాపై కూడా అంచ‌నాలు బాగానే ఉన్నాయి. హిట్ సినిమాకి సీక్వెల్ కావ‌డంతో? బజ్ బాగానే క‌నిపిస్తుంది. స‌క్సెస్ అయితే తెలుగులోనే కొత్త సినిమా ఛాన్సులు అందుకునే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఓదెల 2 ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News