సిద్దూ తో నాగ వంశీ చెప్పిన మూవీ అదేనా?
అయితే సిద్దు ఎన్ని సినిమాలు చేసినా తనకు మంచి ఫామ్, క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది మాత్రం టిల్లు ఫ్రాంఛైజ్ సినిమాలే.
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ను మొదలుపెట్టిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు సక్సెస్‌ఫుల్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు. నటనతో మాత్రమే కాకుండా రైటర్ గా కూడా తనదైన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సిద్దూ తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ ఉంటుందనే రేంజ్ కు అతను చేరుకున్నాడు.
అయితే సిద్దు ఎన్ని సినిమాలు చేసినా తనకు మంచి ఫామ్, క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది మాత్రం టిల్లు ఫ్రాంఛైజ్ సినిమాలే. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సిద్దు. గతేడాది వచ్చిన టిల్లు స్వ్కేర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి సిద్దూ మార్కెట్ ను మరింత పెంచింది.
సిద్దుకి టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండే ఉంది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్, నీరజ కోన దర్శకురాలిగా తెరకెక్కుతున్న తెలుసు కదా సినిమాలతో బిజీగా ఉన్న సిద్దు రీసెంట్ గా వాలెంటైన్స్ డే రోజున అతను నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాను ఇట్స్ కాంప్లికేటెడ్ అని పేరు మార్చి రీరిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఇదిలా ఉంటే గతంలో నిర్మాత నాగ వంశీ తాను సిద్దుతో ఓ సినిమాను అనుకుంటున్నానని, మేం అనుకున్న కథను అలానే స్క్రీన్ పై చూపిస్తే అదొక సందీప్ రెడ్డి వంగా సినిమాలా అనిపిస్తుందని, సినిమా హిట్ అయితే సందీప్ రెడ్డి వంగా లాగా తీశారంటారని, అదే ఫ్లాప్ అయితే సందీప్ రెడ్డి స్టైల్ లో సినిమా చేయాలని ట్రై చేసి ఫెయిలయ్యారంటారని ఓ ఇంటర్య్వూలో అన్నాడు.
తాజా సమాచారం ప్రకారం సిద్దుకి ఆల్రెడీ ఓ స్టోరీ ఓకే అయినట్టు తెలుస్తోంది. ఇట్స్ కాంప్లికేటెడ్ మూవీ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో సిద్దు ఓ సినిమా చేయనున్నాడని, అప్పట్లో నాగ వంశీ చెప్పిన కథ ఇదేనని చాలా మంది అంటున్నారు. నాగ వంశీ చెప్పినట్టు సిద్దుతో సినిమా వర్కవుట్ అయితే మాత్రం డైరెక్టర్ గా రవికాంత్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని సన్నిహిత వర్గాలంటున్నాయి.